GHMC: జీహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. మూడు కార్పొరేషన్లు విభజిస్తూ జీవో రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాను పునర్విభజించి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగనుండగా, కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపొందించారు. ఐటీ, అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల పరిపాలనను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
READ MORE: India vs Pakistan: పాకిస్థాన్ బలుపు మాటలు.. భారత్‌తో మ్యాచ్‌కు ఆసిమ్ మునీర్‌కి సంబంధం ఏంటి?
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
అలాగే ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. వేగంగా విస్తరిస్తున్న నివాస ప్రాంతాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది. ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక మండళ్లు బాధ్యతలు చేపట్టే వరకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిపాలన బాధ్యతలను ఆయన ప్రత్యేక అధికారిగా నిర్వహించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని పరిపాలనా వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల మరియు పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నగర అభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!