Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో విపరీతమైన ప్రలోభాల పర్వం?
- మున్సిపల్ ఎన్నికల్లో విపరీతమైన ప్రలోభాల పర్వం?
- ఓ రేంజ్‌లో ఖర్చుకు సిద్ధమైన అభ్యర్థులు
- నగదు, చీరలు, సిల్వర్, గోల్ట్ వాట్ నాట్?
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఈ స్థాయి ప్రలోభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ పోరాటం కాకుండా…. వ్యయ పోటీగా మారాయా? ఒక ఓటు కోసం 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? హైప్ కోసం అలా ప్రచారం చేస్తున్నారా…? లేక వాస్తవంలో కూడా ఆ రేంజ్ పంపకాలు నడుస్తున్నాయా? అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా మున్సిపల్ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. ఇక పోలింగ్‌కు సిద్ధమవుతున్న వేళ ప్రలోభాల పర్వం జోరందుకుంది. పైకి లేదు లేదంటున్నా…. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు డబ్బునే నమ్ముకున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. అదీకూడా అలా ఇలా కాకుండా….ఓ రేంజ్‌లో ఖర్చు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగదు, చీరలు, సిల్వర్, గోల్డ్‌ను నమ్మకున్నారట కొందరు. ఇక మునిసిపాలిటీల్లోని ఛోటా మోటా నేతలకు బైక్‌లు, కార్లు గిప్ట్‌గా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ప్రలోభాల పర్వం ఆవిష్కృతం కావడం తొలిసారని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
ఇంతకాలం ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, యువత, మహిళలతో ప్రత్యేక భేటీలతో ప్రచారాన్ని అదరగొట్టారు అభ్యర్థులు. ఇప్పుడిక తమ అసలు సిసలు నిజ స్వరూపాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఎలాగైనా గెలువాలి. గెలవాలంటే… ప్రలోభాల వల వేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారట. కొన్ని చోట్ల అయితే… ఒక్కో ఓటుకు ఐదు నుంచి మొదలుకుని 20వేల వరకు ఖర్చు పెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అని లేదు. దాదాపు ప్రతి చోట ఇదే తంతు. మరీ ముఖ్యంగా ఛైర్మన్ పదవి జనరల్ అయిన చోట్ల ఈ డబ్బు ప్రభావం అత్యధికంగా ఉందట. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు పోటీకి దిగారు. కాంట్రాక్టర్లు, రియలెస్టేట్, ఇతర రంగాలకు చెందిన వ్యాపారులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మున్సిపాలిటీల్లో ఎవరెవరి అవసరానికి తగ్గట్టు డబ్బు, బైకులు, కార్లు, చీరలు, పిల్లల ఫీజులు ఇలా ఒకటేమిటి ఎలా కావాలంటే అలా సర్దేస్తున్నారట. అంత ఖర్చుపెట్టి గెలిస్తే ఓకే గానీ మరి ఓడితే పరిస్థితి ఏంటోనన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికలు చూస్తుంటే సేవా భావం పోయి డబ్బు ప్రభావం దండిగా కనిపిస్తోందని అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!