TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..
- అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో టీజీ టెట్ ఫలితాలు
- 2.37 లక్షల దరఖాస్తులు.. 82 శాతం మంది పరీక్షలకు హాజరు
- 50 శాతం మందికి పైగా అర్హత.. కేటగిరీ వారీగా మార్కులు వెల్లడి
- జీవితకాల టెట్ సర్టిఫికేట్.. డీఎస్సీలో 20% వెయిటేజీతో కీలక అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. గత నెలలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET-2026) ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను , స్కోర్ కార్డ్‌లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లేదా https://tgtet.aptonline.in లో చెక్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 10న ఫలితాలు రావడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Amazon సమ్మర్ ధమాకా..! రూ.23,000 Samsung ఫ్రిజ్ ఇప్పుడు కేవలం రూ.15,000 కే..!
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
ఈ ఏడాది టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,95,181 (82.09%) మంది పరీక్షలకు హాజరయ్యారు. జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లు (ప్రస్తుతం పనిచేస్తున్న వారు) అత్యధికంగా 90.27 శాతం మంది హాజరై తమ సత్తా చాటారు. మొత్తం అభ్యర్థులలో సుమారు 1,00,270 మంది (51.37%) అర్హత సాధించినట్లు ప్రాథమిక సమాచారం. కేటగిరీల వారీగా చూస్తే జనరల్ అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 40% కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడంతో ఫలితాల విడుదలపై ఒకట్రెండు రోజులు జాప్యం జరుగుతుందని అంతా భావించారు. కానీ, ఎన్నికల కోడ్ , ఇతర కారణాల ప్రభావం లేకుండా విద్యాశాఖ అనుకున్న సమయానికే ఫలితాలను వెల్లడించి అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించింది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు అందజేసే ‘టెట్ సర్టిఫికేట్’ జీవితకాలం (Lifetime) చెల్లుబాటు అవుతుంది. తదుపరి జరగబోయే ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో (DSC) ఈ టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి.
ఫలితాలు చూసుకోవడం ఎలా?
- అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో ‘Results’ లేదా ‘Score Card’ లింక్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ (లేదా జర్నల్ నంబర్) , పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
- మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!