కార్తీకమాసం మొదలవగానే  భక్తులు అయ్యప్ప మాలను స్వీకరిస్తారు

ఏలినాటి శని నుంచి భక్తులను కాపాడడానికి అయ్యప్పఉపదేశించిన  దీక్షనే అయ్యప్ప దీక్ష అంటారు

పురాణాల ప్రకారం శనితో అయ్యప్ప తన భక్తులు అయ్యప్ప దీక్ష ఎలా పాటిస్తారో చెప్పారట.. ఏడేళ్లు తన భక్తులను పట్టి పీడించకుండా 41 రోజులు ఈ దీక్ష చేసినవారికి విమోచనం  ఇవ్వాలని ఆదేశించారట 

శనికి నలుపు అంటే ఇష్టం కాబట్టి ఆ రంగు దుస్తులనే ధరిస్తారు

ఈ 41 రోజులు తెల్లవారు జామునే లేచి చన్నీటి స్నానం చేసి అయ్యప్పకు పూజ చేస్తారు

కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు

మాంసాహారాలు ముట్టకుండా పచ్చికాయగూరలు వండుకొని తింటారు

రాజభోగాలు, సుఖాలు వదిలి కటిక నేలపై నిద్రిస్తారు

ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మెడలో రుద్రాక్ష మాలను ధరించి నిత్యం స్వామి వారి సేవలోనే గడుపుతారు

తమ స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలవబడతారు

 41రోజుల తరువాత స్వామియే శరణం అయ్యప్ప అంటూ అడవుల వెంబడి నడుచుకుంటూ వెళ్లి తమకు విముక్తి ఇవ్వమని స్వామిని కోరుకుంటారు

నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష చేసిన తన భక్తులను పట్టిపీడించరాదని శనీశ్వరుడికి అయ్యప్ప ఆదేశించారని పురాణాలూ చెప్తున్నాయి