Traffic Advisory: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
- H-CITI పనులతో బంజారాహిల్స్–జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
- ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్, చెక్‌పోస్ట్ వద్ద రద్దీ హెచ్చరిక
- వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు
- రద్దీ సమయాల్లో ప్రయాణం నివారించాలన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం , ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ , అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా, 27.02.2026 నుండి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని , అవసరమైన చోట మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలు , మళ్లింపులు:
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
1. NFCL నుండి వచ్చే ట్రాఫిక్: శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం. 36 & 45 , కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వారు.. శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్ , సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోగలరు. వీరు శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.
2. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 & 45 నుండి వచ్చే ట్రాఫిక్: NFCL వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెం. 2, యూసుఫ్ గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ , పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.
3. KCP , బంజారాహిల్స్ రోడ్ నెం. 1 నుండి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 వైపు వెళ్లవచ్చు.
4. మాసబ్ ట్యాంక్ నుండి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. విరించి హాస్పిటల్ (1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 వైపు వెళ్లవచ్చు.
వాహనదారులకు సూచనలు:
• సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో (ఉదయం 8:30 – 11:00 , సాయంత్రం 5:00 – 9:00) ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.
• ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు , సైన్ బోర్డులను అనుసరించండి.
• తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్ (Google Maps మొదలైనవి) ఉపయోగించండి.
• ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజారవాణా లేదా కార్ పూలింగ్ (Car Pooling) కు ప్రాధాన్యత ఇవ్వండి.
• భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.
తాజా సమాచారం కోసం మా సోషల్ మీడియా వేదికలు (Facebook: facebook.com/HYDTP , Twitter/X: @HYDTP) అనుసరించండి. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయగలరు.
పౌరులందరూ ఈ మళ్లింపులను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!