ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఆడియోతో Samsung Galaxy Buds4 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy Buds4 Series: శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్ లను లాంచ్ చేసింది. Galaxy Buds4, Galaxy Buds4 Pro పేరుతో వచ్చిన ఈ కొత్త మోడల్స్.. Galaxy S26 సిరీస్‌తో కలిసి లాంచ్ అయ్యాయి. అధునాతన అడాప్టివ్ ANC, సూపర్ క్లియర్ కాల్, AI సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్‌లు వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించనున్నాయి.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!
Also Read
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
Galaxy Buds4 సిరీస్‌లో కొత్తగా బడ్స్ బ్లేడ్ (Buds Blade) డిజైన్‌ను అందించారు. లక్షలాది వినియోగదారుల చెవి ఆకారాల ఆధారంగా, వేలాది సిమ్యులేషన్ల ద్వారా ఈ డిజైన్‌ను రూపొందించారు. ఇందులో Galaxy Buds4 Pro వేరియంట్ కెనాల్ ఫిట్ (Canal-fit) డిజైన్‌తో వస్తుంది. ఇది శబ్దాన్ని పూర్తిగా ఐసోలేట్ చేస్తుంది. మరోవైపు Galaxy Buds4 ఓపెన్ లిఫ్ట్ (Open-fit) డిజైన్‌తో వస్తుంది. ఇది ఎక్కువ కంఫర్ట్‌ను అందిస్తుంది.
ఈ ఇయర్‌బడ్‌లు తెలుపు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంటాయి. Buds4 Pro మోడల్‌కు ప్రత్యేకంగా పింక్ గోల్డ్ రంగు ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తుంది. ప్రీమియం మెటల్ ఫినిష్, టచ్ కంట్రోల్స్, ట్రాన్స్‌పరెంట్ ఛార్జింగ్ కేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గాలక్సీ బడ్స్ 4 ప్రోలో పెద్ద వూఫర్, టూ-వే స్పీకర్ సిస్టమ్‌ను అందించారు. అదనంగా, ఎన్హన్సడ్ అడాప్టివ్ ANC, అడాప్టివ్ EQ ఫీచర్లు వినియోగదారుడి చెవి ఆకారానికి అనుగుణంగా ఆటోమేటిక్‌గా సౌండ్ ను సర్దుబాటు చేస్తాయి. ఈ ఇయర్ బడ్ లలో సూపర్ క్లియర్ కాల్ (Super Clear Call) టెక్నాలజీ ఉంది. ఇది AI ఆధారిత నాయిస్ రిడక్షన్ తో కూడి ఉంటుంది.
India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
ఈ సిరీస్‌లో బిక్స్ బై, గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి AI అసిస్టెంట్లకు సపోర్ట్ ఉంది. వాయిస్ కమాండ్ల ద్వారా వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. బుద్స్౪ Proలో హెడ్ గెచర్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా ఫోన్‌ను టచ్ చేయకుండా కాల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఇవి అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో మార్చి 11 నుంచి కొనుగోలు చేయవచ్చు. గాలక్సీ బడ్స్ 4 ధర రూ.16,999 కాగా, గాలక్సీ బడ్స్ 4 ప్రో ధర రూ.22,999గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!