Komali Death Mystery: ఒక ఆత్మహత్య ఎన్నో ప్రశ్నలు.. చావుకు కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komali Death Mystery: యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు కారణాలేంటి? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆమె మిస్టరీ డెత్ వెనుక ఉన్నది లవ్ ఫెయిల్యూరేనా? అఖిల్ చెప్పినట్లు ఆమెది వన్ సైడ్ లవ్వేనా? ఇంతకీ కోమలి రూసుకున్న డైరీలో ఏముంది? ఇద్దరి ఫోన్లలో లభించిన చాటింగ్‌ల సారాంశం ఏంటి? పోలీసులు ప్రాథమికంగా ఏం తేల్చారు?
ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
యూట్యూబర్ కోమలి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? దేనికోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? అఖిల్ ఆమెను ప్రేమించలేదా? ప్రేమించ వద్దంటూ.. చెప్పినప్పటికీ కోమలి ఎందుకు వినలేదు? కోమలి రాసుకున్న డైరీలో ఏముంది? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి కోమలి, అఖిల్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఏడాది కిత్రం బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్రమంలో మరో యువతితో అఖిల్ .. మరో యువతితో చనువుగా ఉంటున్నాడు. దాన్ని జీర్ణించుకోలేక పోయిన కోమలి 6 నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది.
బ్రేకప్ అయిన తర్వాత కూడా కోమలి.. అఖిల్‌ను మర్చిపోలేదు. వారిద్దరి మధ్య మరో యువతి విషయంలో వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. మూడురోజుల క్రితం ఇదే తరహాలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు కోమలి ఆత్మహత్యతో ఒక్కసారిగా నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఐతే కోమలిని అఖిల్ ట్రాప్ చేసి మోసం చేశాడని ఆమె తల్లి వరలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోమలి డైరీ, ఆమె సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని డైరీలో రాసిందని.. ప్రియుడు అఖిల్ మోసం చేసినట్లుగా పేర్కొనలేదని పోలీసులు చెబుతున్నారు.
Sim binding: “సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు”.. మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్..
అటు చిత్రపురి కాలనీలో మరో బ్లాక్‌లో సోదరి ఇంట్లో ఉంటున్న అఖిల్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అఖిల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇద్దరి చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. మరో యువతితో రిలేషన్‌లో ఉన్నానని.. తన వెంట పడొద్దని చెప్పినా ఆమె వినిపించుకోలేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. కోమలి ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు, స్నేహితులకు మీరు బాగుండాలని వాయిస్ మేసేజ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. డైరీలో తన ప్రియుడు అఖిల్ తనను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని కోమలి రాసుకున్నట్లు సమాచారం. అయితే అఖిల్ తనను మోసం చేసినట్లు లేదా వేధించినట్లు ఆమె ఎక్కడా పేర్కొనకపోవడం విశేషం. ప్రస్తుతం పోలీసులు అఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కోమలిది వన్ సైడ్ లవ్ అని అఖిల్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా కోమలి ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై ఉరివేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. కేసు సమగ్ర దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!