Aaya Sher: తొమ్మిది దేశాల్లో ‘ఆయా షేర్’ హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ద ప్యారడైజ్’ (The Paradise). అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు పెంచేసిన ‘ద ప్యారడైజ్’ సినిమా, ఇప్పుడు తన మొదటి పాటతోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్’ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేస్తోంది. తెలుగు సినిమా పాటలు గ్లోబల్ లెవల్‌లో ట్రెండ్ అవ్వడం చూస్తుంటాం, కానీ ‘ఆయా షేర్’ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read:Toxic : కోలీవుడ్‌లో యష్ ‘టాక్సిక్’ ప్రభంజనం.. ఆల్ టైమ్ రికార్డ్ ధరకు తమిళ్ థియేట్రికల్ రైట్స్
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
భారత్ మరియు యూఏఈ దేశాల్లో ఈ పాట అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా (USA), యూకే (UK), ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, సౌదీ అరేబియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ సాంగ్ టాప్ ర్యాంక్స్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం నంబర్లు మాత్రమే కాదు, ఈ పాటలోని ‘రా ఇంపాక్ట్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాని స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన వేసిన హుక్ స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నేల మీద చేసే ఆ ‘ఫ్లోర్ మూవ్’కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ ఈ స్టెప్‌ను రీ-క్రియేట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
Also Read:Theater vs OTT : ఓటీటీ 8 వారాల నిబంధన అమలు సాధ్యమేనా? బాలీవుడ్ రూల్ ఇక్కడ వర్తిస్తుందా?
‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ట్యూన్ ఈ సినిమా ప్రమోషన్స్‌కు ఓ రేంజ్ హైప్ ఇచ్చాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం, మొదటి పాటతోనే బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విధ్వంసం సృష్టించబోతుందో హింట్ ఇచ్చేసింది.
ప్రస్తుతానికి ‘ఆయా షేర్’ గర్జన తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఖండాంతరాల వరకు వినిపిస్తోంది. సినిమా విడుదలయ్యాక ఈ జోరు ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!