Off The Record : నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్‌పై మారుతున్న సీన్స్..
- నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్‌పై మారుతున్న సీన్స్..
- ధర్మాన, బగ్గు కుటుంబాల నుంచి కొత్త తరం..
- వారసుల్ని తెర మీదికి తెచ్చిన కృష్ణదాస్, బగ్గు రమణమూర్తి..
- 2029 ఎమ్మెల్యే టిక్కెట్ రేస్‌లోకి కృష్ణదాస్ కొడుకు చైతన్య?..
- తాజాగా యాక్టివ్ అయిన ఎమ్మెల్యే బగ్గు కుమార్తె అర్చన..
- నరసన్నపేటలో ఇక పొలిటికల్ సౌండ్ పెరుగుతుందన్న టాక్..
- చైతన్యకు సపోర్ట్ చేయమని ద్వితీయశ్రేణికి కృష్ణదాస్ విన్నపాలు..
- ఎగ్రెసివ్‌గా అడుగులేస్తున్న ఎమ్మెల్యే కుమార్తె బగ్గు అర్చన..
- ఇక నుంచి నరసన్నపేటలో యంగ్ పాలిటిక్స్ ఉంటాయా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : ఏపీ పాలిటిక్స్‌లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎన్నికల టైంలో తప్ప మిగతా ఎప్పుడూ అడిషనల్ నాయిస్ ఉండదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం కామ్‌గా జరిగిపోతుంటుంది. ఇక్కడ దశాబ్దాల నుంచి ధర్మాన వర్సెస్ బగ్గు ఫ్యామిగా రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు వైసీపీ తరపున, బగ్గు లక్ష్మణరావు, బగ్గు రమణమూర్తి టిడిపి నుంచి వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయితే… రాజకీయాలలో తలపండిన ఈ నేతలు ఇక రిటైర్ అవ్వాలనుకుంటున్నారట. అందుకే మెల్లిగా తమ వారసుల్ని తెర మీదికి తీసుకువచ్చి పొలిటికల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం పోలాకి జెట్పీటీసీగా ఉన్నారు. తన రాజకీయ వారసుడిని ఆశీర్వదించమంటూ ఇప్పటికే పలు వైసీపీ మీటింగ్స్‌లో విజ్ఞప్తి చేశారు కృష్ణదాస్. ఈ లెక్కన 2029 ఎన్నికల నాటికి కృష్ణ చైతన్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఇక తాజాగా..సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన కూడా నియెజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా పొలిటికల్ యాక్టివిటీ పెంచడం, ఇద్దరు యువ నేతలు ఎక్కువగా వివిధ కార్యక్రమాలకు హాజరవడం హాట్ టాపిక్ అవుతోంది. ఒక్కసారిగా యంగ్ యాక్టివిటీ పెరిగిపోవడంతో… నరసన్నపేట టీడీపీ, వైసీపీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ పెద్దోళ్ళ సైలెంట్ పాలిటిక్స్‌కు ఇక కాలం చెల్లింది, మన దగ్గర కూడా రీ సౌండ్ వస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇద్దరు నాయకులు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌ని ఉత్తేజ పరిచేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. గత సాధారణ ఎన్నికలలోనే ధర్మాన కృష్ణ దాస్ తనకు కాకుండా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని అధినేత జగన్‌ను కోరారుగానీ కుదరలేదు. కానీ ఇప్పుడు మాత్రం అధిష్టానం దృష్టిలో ఉంచారో లేదో గానీ…వరుస సమావేశాలలో కృష్ణ చైతన్యకు అండగా ఉండాలని ద్వితీయ శ్రేణి నేతలకు చెబుతున్నారట. కృష్ణ చైతన్య దూకుడుగా పార్టీ కార్యక్రమాలకు ఎటెండ్ అవుతుంటే , దాస్ కాస్త విరామం తీసుకుంటున్నారన్నది లోకల్ టాక్ . మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కూడా కృష్ణ చైతన్యను ఢీ కొట్టేలా తన వారసురాలిని బరిలో దింపేందు ప్లాట్ పాం సిద్దం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ రాజకీయాల జోలికి రాని బగ్గు అర్చన ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడమేగాక ఎగ్రెసివ్‌గా పొలిటికల్ ప్లానింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంటా బయటా అంతా తానై వ్యవహరిస్తూ… తండ్రితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. ఇలా వారసుల రాకతో నరసన్నపేట రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. రాజకీయాలకు యువ రక్తం తోడైతే జోష్ పక్కా..అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల టైంకి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!