ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ViRosh Wedding: టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు.
READ ALSO: Traffic Advisory: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?

హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఆ తర్వాత రష్మిక సొంత ప్రాంతమైన ‘కొడగు’ (కర్ణాటక) సంప్రదాయ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ (ViRo-shi) అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. విజయ్, రష్మిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని ఇలా వ్యక్తపరిచారు.. “హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నాను.. మిస్టర్ విజయ్ దేవరకొండ!”.. అంటూ రాసుకొచ్చారు. ఇన్నాళ్లూ వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న రూమర్లకు రష్మిక ఈ పోస్ట్‌తో ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, తన పెళ్లి విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో తన పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.



READ ALSO: Sunetra Pawar: ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా లేడీ బాస్..
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?