T20 World Cup 2026: గొప్ప సహాయం చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా సెమీఫైనల్స్ ఛాన్సెస్ మరింతగా మెరుగు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా జరిగిన కీలక పోరులో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టు 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపు దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా, టీమిండియా ఆశలను కూడా సజీవంగా ఉంచింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయ పథంలో నడిపించాడు. అతనికి క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్ చక్కని సహకారం అందించారు. ఈ పోరులో ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే (16.1 ఓవర్లలోనే) లక్ష్యాన్ని ఛేదించి దక్షిణాఫ్రికా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
READ ALSO: Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం అద్భుతం కాదు.. అపహాస్యం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
విండీస్ రన్ రేట్‌కు భారీ గండి..
ఈ ఘోర పరాజయం వెస్టిండీస్ సెమీస్ అవకాశాలపై దెబ్బకొట్టింది. 9 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వెస్టిండీస్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. మ్యాచ్‌కు ముందు +5.35 గా ఉన్న విండీస్ రన్ రేట్, ఇప్పుడు +1.791 కి పడిపోయింది. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికా విజయం తర్వాత గ్రూప్-A పాయింట్ల పట్టికలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోవడంతో ఇప్పుడు టీమిండియా భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది. రన్ రేట్ గందరగోళం లేకుండా భారత్ సెమీస్ చేరడానికి మార్గం సుగమమైంది. భారత్ తన నెక్ట్స్ రెండు మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్తుంది. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా కొట్టిన దెబ్బకు వెస్టిండీస్ కోలుకోలేకపోయింది. ఈ ఫలితం గ్రూప్‌లో దక్షిణాఫ్రికాను అగ్రస్థానానికి చేర్చడమే కాకుండా, భారత అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!