Medical Miracle:వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భాశయం లేని మహిళకు పండంటి బిడ్డ.. ఎలా సాధ్యమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధుర స్వప్నం. కానీ.. ప్రకృతి సిద్ధంగా గర్భాశయం లేకుండా జన్మించిన వారికి ఆ కల అందని ద్రాక్షే. అయితే ఆధునిక వైద్య శాస్త్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని విజయవంతంగా అమర్చుకుని, ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిటన్ వైద్య చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read : Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
వివరాలోకి వెళ్ళితే.. యూకేకు చెందిన గ్రేస్ బెల్ అనే మహిళ గర్భాశయం లేకుండా జన్మించింది (దీనిని వైద్య పరిభాషలో MRKH సిండ్రోమ్ అంటారు). దీనివల్ల ఆమెకు పీరియడ్స్ వచ్చే అవకాశం లేదు, కానీ ఆమె అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నాయి. తన సొంత బిడ్డను కనాలనే కోరికతో ఉన్న ఆమెకు వైద్యులు ఒక సాహసోపేతమైన మార్గాన్ని సూచించారు. మరణించిన ఒక దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని గ్రేస్ బెల్‌కు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. లండన్‌లోని క్వీన్ చార్లెట్ & చెల్సియా ఆసుపత్రి వైద్య బృందం ఈ అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
గర్భాశయ మార్పిడి తర్వాత, గ్రేస్ బెల్ గర్భం దాల్చడం, గత ఏడాది క్రిస్మస్‌కు ముందు ఒక పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం వైద్య లోకంలో ఒక సంచలనంగా మారింది. ఆ చిన్నారికి ‘హ్యూగో’ అని పేరు పెట్టారు. యూకేలో ఇటువంటి ప్రసవం జరగడం ఇదే మొట్టమొదటిసారి. గర్భాశయం లేని ఎంతోమంది మహిళలకు ఈ విజయం కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ‘విజ్ఞాన శాస్త్రం, దాతల గొప్ప మనసు కలిస్తే ప్రాణం పోయగలవు’ అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?