TamilNadu: ప్రేమోన్మాదానికి ఒకే ఇంట్లో ఇద్దరి హత్య.. ఒకరి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TamilNadu: ప్రేమ.. మనసులను కలపాల్సిన భావన.. కానీ అదే ప్రేమ పిచ్చిగా మారితే ప్రాణాలు తీసే స్థాయికి వెళితే.. తమిళనాడులో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు ఈ ప్రశ్ననే లేవనెత్తుతోంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు కత్తితో దాడికి దిగాడు. ఆమెను కాపాడేందుకు వచ్చిన అవ్వను కూడా కిరాతకంగా హత్య చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన అక్కపై కూడా దాడి చేసి పరారయ్యాడు. ఈ సంచలన ఘటన తమిళనాడులో పొల్లాచ్చి సమీపంలో కలకలం రేపింది.
READ ALSO: NLG FAKE BABA ARREST: కంత్రీ మాంత్రికుడు..
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలో గౌండన్ పాళయంకు చెందిన భూపతి ద్విచక్ర వాహన మెకానిక్ షాపు నడుపుతున్నారు. ఆయనకు భార్య కలైయరసి. హరిత, కౌసి అనే కుమార్తెలు ఉన్నారు. తన తల్లి మైలాత్తాళ్‌తో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కౌసి చదువు మానేసి ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. కప్పలంగరైకి చెందిన అభిషేక్‌తో అక్కడ కౌసికి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న సమాచారంతో కుమార్తెను భూపతి మందలించారు. అదే సమయంలో అభిషేక్ తన తల్లిదండ్రులతో కలిసి కౌసిని వివాహం చేయించాలని భూపతి కుటుంబాన్ని సంప్రదించి విన్నవించాడు. కౌసికి వివాహ వయసు రాలేదని, ఆమెకు ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదని పేర్కొంటూ వారిని భూపతి పంపించేశారు.
అయితే తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వస్తే అవమానించడమే కాకుండా, తనకు పెళ్లి వద్దంటూ కౌసి చెప్పిందని తెలుసుకున్న అభిషేక్ ఉన్మాదిగా మారాడు. రాత్రి కౌసి ఇంటికి వెళ్లి ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను కిరాతకంగా పొడిచాడు. ఆమె అరుపులు విన్న అవ్వ మైలాత్తాల్ పరుగున రాగా.. ఆమైపై కూడా దాడిచేశాడు. ఇద్దర్ని విచక్షణా రహితంగా పొడిచాడు. దీనిని చూసిన హరితపై కూడా కత్తితో దాడి చేసి పరారీ అయ్యాడు. రక్తపు మడుగులోపడి ఉన్న హరితను ఇరుగు పొరుగు వారు పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కౌసి, మైలాత్తాల్ మరణించారు. హరిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరారీలో ఉన్న అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
READ ALSO: ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..
తాజావార్తలు
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!