T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ప్రారంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఈ పరిస్థితిలో జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్ జట్టు స్కోర్ బాధ్యతను తీసుకున్నారు.
India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీ20 చరిత్రలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్ మాత్రమే కాదు.. మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల చరిత్రలో ఇదే అత్యధిక 8వ వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు రూబెన్ ట్రంప్ ఎల్మన్, డేవిడ్ విఎస్ పేరిట ఉండేది. వీరు 2022లో UAEపై 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పుడు హోల్డర్–షెపర్డ్ జోడీ ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది.
Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!
ఈ ఇద్దరి అద్భుత బ్యాటింగ్‌తో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. హోల్డర్ 31 బంతుల్లో 49 పరుగులు చేసి కీలక పాత్ర పోషించగా, షెపర్డ్ 37 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. హోల్డర్–షెపర్డ్ జోడీ నమోదు చేసిన 89 పరుగుల భాగస్వామ్యం, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 8వ వికెట్ లేదా అంతకంటే దిగువ స్థానంలో రెండో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. ఈ విభాగంలో బెల్జియంకు చెందిన సాబేర్ జాఖిల్, శాఖ్లైన్ అలీ 2021లో ఆస్ట్రియాపై 132 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!