WEF President : ఎప్స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WEF President: వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓగా ఉన్న బోర్జ్ బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక నేరస్థుడిగా పేరున్న జెఫ్రీ ఎప్స్టీన్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అమెరికా న్యాయశాఖ వివరాల ప్రకారం.. బోర్జ్ బ్రెండే గతంలో ఎప్స్టీన్‌తో కలిసి మూడుసార్లు బిజినెస్ డిన్నర్లు (విందులు) చేశారు. అంతేకాకుండా, వీరిద్దరూ ఈమెయిల్స్, మెసేజ్‌ల ద్వారా కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. తన రాజీనామా ప్రకటనలో బ్రెండే నేరుగా ఎప్స్టీన్ పేరును ఎక్కడా చెప్పలేదు. “ఎనిమిదిన్నర ఏళ్ల ప్రయాణం తర్వాత తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది” అని మాత్రమే పేర్కొన్నారు.
READ ALSO: T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!
Also Read
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
బ్రెండే దీనిని సాధారణ రాజీనామాగా చూపిస్తున్నప్పటికీ, ఆయనపై జరుగుతున్న అంతర్గత దర్యాప్తు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. బోర్జ్ బ్రెండే నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఈయన నార్వే దేశానికి చెందిన ప్రముఖ నాయకుడు. గతంలో నార్వే ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులను, ఉన్నత స్థాయి దౌత్య బాధ్యతలను నిర్వహించారు. తర్వాత ఆయన ఎనిమిదిన్నర ఏళ్లుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంను నడిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వేదికపై చక్రం తిప్పిన బోర్జ్ బ్రెండే, ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ అనే వివాదాస్పద వ్యక్తితో తనకున్న పాత పరిచయాల కారణంగా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వేదికకు కొత్త బాస్ ఎవరు వస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
READ ALSO: India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!