TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త..!
- నకిలీ వెబ్‌సైట్లతో భక్తులను మోసం చేస్తున్న దళారీలు
- విజిలెన్స్ విభాగం నిఘా ముమ్మరం
- ఫేక్ లింక్‌లపై కాపీరైట్ చట్టం కింద కేసులు
- అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలన్న సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి భక్తులు తిరుమల దర్శనం , వసతి గదుల కోసం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హెచ్చరించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన విధంగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘాను ముమ్మరం చేసింది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు ‘కర్ణాటక ప్రవాసి సౌధ’ పేరుతో గదులు ఇప్పిస్తామన్న నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు, గూగుల్ సెర్చ్‌లో టీటీడీ పేరుతో కనిపిస్తున్న పలు ఫేక్ లింకులు భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ వెబ్‌సైట్లలో టీటీడీ లోగోలు, శ్రీవారి ఆలయ చిత్రాలను అనధికారికంగా వాడుతూ భక్తులను నమ్మిస్తున్నారని తేలింది.
Rahul Gandhi: ఆ రెండు విషయాలు లేవనెత్తుతాననే లోక్‌సభలో మాట్లాడనివ్వలేదు
Also Read
ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. భక్తులు తమ దర్శనం, వసతి , ఇతర సేవా టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అయిన [అనుమానాస్పద లింక్ తీసివేయబడింది] ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్‌లో కనిపించే అనుమానాస్పద లింక్‌లను నమ్మవద్దని, దళారుల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్లు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరారు.
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!