CM Revanth Reddy : కొత్త చట్టం తెస్తున్నాం.. తల్లిదండ్రులను విస్మరిస్తే జీతంలో 15 శాతం కోత..
- గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలు పూర్తి చేశామన్న సీఎం
- అధికారులకు దిశానిర్దేశం.. బాధ్యత మర్చిపోవద్దన్న హెచ్చరిక
- తల్లిదండ్రులను విస్మరిస్తే జీతంలో 15% కోత చట్టం
- హార్వర్డ్‌తో ఒప్పందం.. అధికారులకు ప్రపంచ స్థాయి శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల నుంచి సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు వరకు అన్నీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగినవేనని గుర్తు చేశారు. కేవలం మణులు, మాణిక్యాల కోసం ఎవరూ పోరాడలేదని, ఆత్మగౌరవం కోసమే తిరుగుబాట్లు వచ్చాయని పేర్కొన్నారు.
గ్రూప్-1 ఫలితాలు వచ్చిన సంతోషాన్ని కూడా ప్రతిపక్షాలు ఉండనివ్వలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు. కానీ మీ పక్షాన కోర్టుల్లో మేమే నిలబడి వాదనలు వినిపించాం. న్యాయపరమైన చిక్కులన్నింటినీ ఛేదించి, మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చాం” అని ఆయన అన్నారు. మీరు మా కుటుంబ సభ్యులని, అధికారులమనే అహంకారంతో బాధ్యత మరవద్దని హెచ్చరించారు. ప్రభుత్వానికి అధికారులు కళ్లు, చెవులు వంటివారని, పేదలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత మీపైనే ఉందని గుర్తు చేశారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం అద్భుతం కాదు.. అపహాస్యం
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. “ఉపాధి హామీ కూలీలుగా పనిచేసి మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం రాగానే వారిని విస్మరించడం సరికాదు. అందుకే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక కొత్త బిల్లును తీసుకువస్తున్నాం. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి జీతం నుంచి 15 శాతాన్ని కోత విధించి నేరుగా అమ్మానాన్నల ఖాతాలో వేసేలా చట్టం తెస్తాం” అని స్పష్టం చేశారు.
తెలంగాణ అధికారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సీఎం తెలిపారు. తాను స్వయంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వారితో ఒప్పందం (MoU) చేసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు MCRHRD కి వస్తారని, ఇక్కడే ఉన్నత స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తారని భరోసా ఇచ్చారు. చివరగా అధికారులకు సూచిస్తూ.. “జాయిన్ అయిన రోజు ఎంత నిజాయితీగా, ఉత్సాహంగా ఉన్నారో.. రిటైర్మెంట్ రోజున కూడా అలాగే ఉండాలి. చట్టాలను ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలి తప్ప, ఆపడానికి కాదు” అని హితవు పలికారు.
Netanyahu’s ‘Love Story’: ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని ‘లవ్ స్టోరీ’.. నవ్వు ఆపుకోలేకపోయిన పీఎం మోడీ!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!