Most Expensive Cheese: పనికిమాలిన గాడిద కాదు.. లక్షలు కురిపించే గాడిద! కేజీ జున్ను ధర వింటే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Expensive Cheese: పనికిమాలిన గాడిద.. బహుశా ఈ పదం వినని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు కావచ్చు. ఏదో ఒక సందర్భంలో, తల్లిదండ్రులు, లేదంటే గురువులు, స్నేహితులు ఎవరో ఒకరు మనల్ని అనే సాధారణ పదం పనికిమాలిన గాడిద. కానీ ఇప్పటి నుంచి ఈ పదం మాత్రం అస్సలు వాడకండే.. ఎందుకంటే గాడిద పాలు చాలా చాలా ఖరీదైనవిగా మారాయి. పనికిమాలిన గాడిద అంటే ఖరీదైన పాలిచ్చే గాడిద ఫీల్ అవుతుంది. గాడిద పాలతో తయారయ్యే జున్ను ధర కేజీ అక్షరాలా రూ.55 వేల పైనే పలుకుతుందంట. ఇంతకీ ఆ జున్ను స్పెషల్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఈ జున్ను ఆవు పాలు లేదా గేదె పాలతో కాకుండా, చాలా అరుదైన బాల్కన్ జాతి గాడిదల పాలతో తయారు చేస్తారు. ఈ గాడిదలు ప్రపంచం మొత్తంలో కేవలం సెర్బియాలోని ‘జసవికా’ అనే ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఒక కిలో జున్ను తయారు చేయడానికి దాదాపు 25 లీటర్ల గాడిద పాలు అవసరమవుతాయి. నిజానికి గాడిదలు చాలా తక్కువ పాలను ఇస్తాయి, అందుకే దీని ధర ఒక పౌండ్‌కు (సుమారు అరకేజీ) 600 డాలర్లు, అంటే మన దేశీ కరెన్సీలో సుమారు రూ.55,000 వరకు ఉంటుంది. అలాగే ఈ జున్ను తయారు చేయడం కూడా ఒక కళ అని చెబుతున్నారు. దీన్ని తయారు చేయడానికి నెలల సమయం పడుతుందంట. ఇందులో కేవలం గాడిద పాలే కాకుండా, రుచి కోసం కొంత శాతం ఆవు పాలు లేదా మేక పాలను కూడా కలిపి తయారు చేస్తారని అంటున్నారు. గాడిద పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పూర్వ కాలంలో ఈ పాలను చర్మ సౌందర్యం కోసం కూడా వాడేవారని ప్రతీతి. ఇది ఇతర జున్నుల కంటే భిన్నమైన రుచిని, సువాసనను కలిగి ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులు దీనిని ఒక్కసారైనా రుచి చూడాలని ఆశపడుతుంటారు. మీకు జున్ను అంటే ప్రాణమైతే, మీ బడ్జెట్ అనుమతిస్తే.. ప్రపంచంలోనే అరుదైన ఈ ‘పులే చీజ్’ను ఒకసారి ట్రై చేయండి.
READ ALSO: Hemant Soren: సీఎం సార్ సేఫ్.. జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!