Modi Israel Visit: ‘‘హిందుత్వం-జియోనిజం’’.. మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై ముస్లిం దేశాల మీడియా అక్కసు..
- మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై ప్రపంచం ఆసక్తి..
- మోడీ విజిట్‌పై ముస్లిం దేశాల మీడియా అక్కసు..
- హిందుత్వ-జియోనిజం కలిశాయని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Israel Visit: భారత ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ పర్యటన ప్రపంచదేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాలలో ఈ పర్యటన పట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయిల్ ప్రధాని మోడీని ఘనంగా స్వాగతించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్, నెస్సెట్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇలా ఒక భారత ప్రధాని ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడటం ఇదే మొదటిసారి. ప్రధాని మోడీకి ‘‘మెడల్ ఆఫ్ దిన నెస్సెట్’’ను ఇజ్రాయిల్ బహూకరించింది. రెండు దేశాలు కూడా తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి.
అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ చేసిన దాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ బాధల్లో భారత్ అండగా ఉంటుందని చెప్పారు. యూదు, హిందూ ధర్మాల సారూప్యాన్ని కొనియాడారు. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ చేసుకున్న ‘‘అబ్రహం ఒప్పందాన్ని’’ ప్రధాని ప్రశంసించారు. 2U2 (భారతదేశం-ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్-యుఎఇ),IMEC (భారతదేశం-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్) వంటి వేదికల ద్వారా భారత్-ఇజ్రాయిల్ సహకారాన్ని పెంచుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
* ఇదిలా ఉంటే.. గల్ఫ్, మిడిల్ ఈస్ట్‌లోని ఇస్లాం దేశాల మీడియా ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై తమ అక్కసును వెళ్లగక్కాయి. “భారతదేశ ప్రధాని మోడీ నెస్సెట్‌లో ఇజ్రాయెల్‌ను బహిరంగంగా ప్రశంసించారు, ఇది గాజా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న నెతన్యాహుకు ప్రధాన దౌత్య విజయంగా పరిగణించబడుతుంది.” అని టర్కిష్ మీడియా సంస్థ టీఆర్టీ వరల్డ్ నివేదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించిన నేరస్తుడు నెతన్యాహును మోడీ ఆలింగనం చేసుకున్నారు. హమాస్‌ను ఖండించారు. కానీ గాజా గురించి ప్రస్తావించలేదు. గాజాలో ఇజ్రాయిల్ చేసిన మరణాలు, భారీ నష్టాల గురించి మోడీ మౌనంగా ఉన్నారు’’ అని నివేదించింది.
* ‘‘ఈ పర్యటన భారతదేశ సాంప్రదాయ పాలస్తీనా అనుకూల విధానం నుంచి ఒక ప్రధాన సైద్ధాంతిక మార్పును సూచిస్తుంది. గాజాలో మానవతా సంక్షోభం కన్నా వ్యూహాత్మక లాభాలకే ఎక్కువ ప్రాధాన్తయ ఇచ్చారు. నెతన్యాహూ, మోడీ, ఇద్దరూ జాతీయవాదు, ప్రజాదరణ పొందిన వారు. కాశ్మీర్, పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ వంటి వివాదాలు రెండు దేశాలకు ఉన్నాయి’’ అని అల్ జజీరా కవరేజ్ ఇచ్చింది.
* మిడిల్ ఈస్ట్ ఐ మీడియా.. ‘‘ నెస్సెట్‌లో మోడీ ప్రసంగం భారత్ దీర్ఘకాలిక విదేశాంగ విధానం నుంచి నిష్క్రమణను సూచిస్తుంది. హిందుత్వ-జియోనిజం మధ్య సైద్ధాంతిక కలయికకు నిదర్శనం’’ అని రాసింది.
* ‘‘ఇజ్రాయిల్ గాజాలో సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తు్న్న సమయంలో మోడీకి ఆ దేశ పార్లమెంట్‌లో స్టాండింగ్ ఒవేషన్ కేవలం లాంఛనప్రాయం కాదు. రాజకీయ సందేశం. యుద్ధ నేరాల ఆరోపణల నేపథ్యంలో మోడీ ఆ దేశానికి వెళ్లడం ద్వారా ఇజ్రాయిల్ పూర్తిగా ఒంటరిగా లేదని సూచిస్తుంది’’ అని పాలస్తీనా క్రానికల్ రాసింది.
* ప్రధాని మోదీ ప్రసంగం గురించి పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ .. “తన ప్రసంగంలో, గాజాలో రెండు సంవత్సరాలకు పైగా జరిగిన యుద్ధంలో మరణించిన వేలాది మంది పాలస్తీనియన్ల గురించి మోడీ ప్రస్తావించలేదు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారతదేశం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ పర్యటనలో ఆయన ఏ పాలస్తీనా నాయకులను కలవలేదు.” అని రాసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!