Ragi Ambali: ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే ‘రాగి అంబలి’.. ఇలా చేస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Ambali: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు తాగుతుంటాం. కానీ, మన పూర్వీకులు వేసవిలో ఒంటిని చల్లబరచడానికి, శరీరానికి అపరిమితమైన శక్తిని ఇవ్వడానికి రాగి అంబలిని వాడేవారని ఎంత మందికి తెలుసు. ముఖ్యంగా పులియబెట్టి చేసే ఈ రాగి అంబలి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియస్తే ఆశ్చర్యపోతారు. ఈ అమృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Operation Octopus: 16 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల గర్జన.. 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
రాగి అంబలి తయారీ విధానం:
ఒక మట్టి కుండలో అర కప్పు రాగి పిండి, అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా (కనీసం 8-10 గంటలు) చల్లని ప్రదేశంలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండి పులిసి ఔషధ గుణాలు వస్తాయి. తర్వాతి రోజు ఉదయం, స్టవ్ మీద కుండలో ఒక లీటర్ నీటిని మరిగించాలి. ఎసరు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో తిప్పాలి. సన్నటి సెగపై 10-15 నిమిషాల పాటు బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపై స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఒక కప్పు పెరుగును సాఫ్ట్‌గా చిలికి, అందులో 3-4 కప్పుల నీళ్లు పోసి మజ్జిగ తయారు చేయాలి. ఇందులోకి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచి వేయాలి. అలాగే కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు (బ్లాక్ సాల్ట్ ఉంటే ఇంకా మంచిది) కలపాలి. చల్లారిన రాగి జావలో, అప్పుడే తయారు చేసుకున్న మజ్జిగను వడకట్టి కలపాలి. చివరగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే అమోఘమైన రాగి అంబలి రెడీ అయిపోతుంది.
అద్భుత ప్రయోజనాలు ఇవే..
* ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
* పిండిని రాత్రంతా పులియబెట్టడం వల్ల ఇందులో పొట్టకు మేలు చేసే ‘గుడ్ బ్యాక్టీరియా’ పెరుగుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
* రాగుల్లో ఉండే కాల్షియం, ఐరన్ ఇతర పోషకాలు శరీరానికి ఉక్కు వంటి బలాన్ని ఇస్తాయి.
READ ALSO: Marriage Frauds : హైదరాబాద్‌లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!