దోసకాయ రసం: ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి - బి వంటి పోషకాలుంటాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైనది. శరీర బరువుని తగ్గించడంలో దోహదపడుతుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది.  కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

క్యారెట్ రసం: ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర బరువుని తగ్గించి, జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కొవ్వును తగ్గించడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. 

క్యాబేజీ రసం: బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇది అన్ని శారీరక కార్యకలాపాలకు మంచిది.

బీట్‌రూట్ రసం: ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, కె, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీని తగ్గించడానికి.. అలాగే శరీరంలో బ్లడ్ వాల్యూమ్‌ను పెంచడానికి దోహదపడుతుంది.

పాలకూర రసం: ఇది శరీరానికి పోషకాలను సమర్థవంతంగా అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఇది ఉత్తమమైంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణక్రియ ప్రక్రియను పటిష్టం చేసి చేస్తాయి.

కాకరకాయ రసం: ఈ రసంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇది కొత్త కొవ్వు కణాల నిర్మాణం, పెరుగుదలను నిరోధిస్తుంది. ఊబకాయం చికిత్సకు సహజమైన ఏజెంట్‌గా పని చేస్తుంది.

ఉసిరి రసం: ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉసిరి రసం తాగితే.. అనతి కాలంలోనే బరువు తగ్గడంతో పాటు రోజంతా శక్తివంతంగా ఉంటారు.

కలబంద రసం: ఇది జీవక్రియకు తక్షణ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే.. అనతి కాలంలో బరువు తగ్గుతారు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.