IP66, IP68, IP69 రేటింగ్స్, 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో Oppo Reno 15c అమ్మకాలు షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Reno 15c: జనవరిలో ఒప్పో రెనో15 సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించిన ఒప్పో రెనో 15c (OPPO Reno 15c) స్మార్ట్‌ఫోన్ ను కంపెనీ భారత్ లో అమ్మకాలు మొదలు పెట్టింది. స్టైలిష్ డిజైన్, భారీ బ్యాటరీ, మంచి కెమెరాలతో ఈ ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Also Read
- New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
- ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.57-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఇంకా ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలతో పాటు సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది.
ఒప్పో రెనో 15cలో ప్రధాన ఆకర్షణగా 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో IP66, IP68, IP69 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G కనెక్టివిటీ, Bluetooth 5.4, Wi-Fi, USB Type-C వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆఫ్టర్ గ్లో పింక్, ట్విలైట్ బ్లూ రంగుల్లో లభిస్తోంది.
8GB + 256GB వేరియంట్ ధర రూ.34,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. ఈ ఫోన్ ను అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ల కింద కొనుగోలుదారులకు కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇందులో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు UPI లావాదేవీలపై 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 12 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ EMI ఆప్షన్, రూ. 3,000 ఎక్స్చేంజ్ బోనస్, 180 రోజుల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉచితంగా లభిస్తుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!