U19 World Cup 2026: “కుర్రాళ్లు కసితో ఉన్నారు.. కప్పు కొట్టేస్తారా?” భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
U19 Cricket World Cup 2026: నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జింబాబ్వే దేశ రాజధాని హరారేలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తుది పోరు ఉండనుంది. ఇప్పటివరకు ఐదుసార్లు అండర్-19 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించిన టీమిండియా తాజాగా ఆయుష్ మాథ్రే నాయకత్వంలో విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు వచ్చింది. ఇప్పుడు హరారేలో ఇంగ్లాండ్‌తో తుది సమరానికి సిద్ధమవుతోంది. ఇరు జట్లు కూడా అజేయంగా ఫైనల్‌కు రావడంతో ఈ పోరు మరింత ఉత్కంఠగా మారింది. అయితే ఫైనల్‌కు ముందు భారత్ ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభంలోనే అమెరికాతో మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. బులావాయోలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ముందుగా మెరుపులు మెరిపించారు. అమెరికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కానీ లక్ష్య ఛేదనలో భారత్ ఒక్కసారిగా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కాస్త కంగారు పెట్టింది. ఆ సమయంలో అభిగ్యాన్ కుండు ధైర్యంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కాస్త ఒత్తిడి ఉన్నా, చివరకు భారత్ విజయంతో టోర్నీని ఆరంభించింది.
READ MORE: KA 2 : కిరణ్ అబ్బవరంకు ‘క-2’ షాక్? హీరోను మార్చే ఆలోచనలో మేకర్స్!
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 238 పరుగులు చేసింది. ఇది భారీ స్కోరు కాకపోయినా, సూర్యవంశీ, కుండు అర్ధసెంచరీలతో పోటీ స్కోరే అయ్యింది. కానీ బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో 106కి రెండు వికెట్లు మాత్రమే పడడంతో మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్తున్నట్లు అనిపించింది. డీఎల్‌ఎస్ ప్రకారం.. బంగ్లాదేశ్ లక్ష్యం 165 పరుగులగా నిర్దేశించారు. ఈ తరుణంలో స్పిన్నర్లు రంగంలోకి దిగారు. అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి 8 వికెట్లను కేవలం తదుపరి 40 పరుగులకే కూల్చేశారు. భారత్ 18 పరుగుల తేడాతో గెలిచింది. గెలుపు వచ్చినా, బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్న భావన మాత్రం మిగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లోనూ వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఈసారి భారత్ ఎలాంటి ఇబ్బంది పడలేదు. భారత పేసర్లు చెలరేగి కివీస్‌ను 135 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ తర్వాత డీఎల్‌ఎస్ లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాథ్రే ఆరంభంలోనే దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. దీంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించి సూపర్ సిక్స్‌కు చేరింది.
READ MORE: 9500 ప్రాసెసర్, 1.5K AMOLED డిస్‌ప్లే, హెవీ మల్టీటాస్కింగ్‌తో Oppo K14 Turbo Series లాంచ్
సూపర్ సిక్స్‌లో ఆతిథ్య జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత జట్టు అసలైన సత్తా చూపించింది. ఈ మ్యాచ్‌లో వర్షం లేకపోవడం భారత్‌కు కలిసొచ్చింది. వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా అద్భుతంగా 109 పరుగులు చేశాడు. అతనికి కుండు 62 పరుగులతో సహకరించాడు. చివర్లో ఖిలాన్ పటేల్ వేగంగా పరుగులు చేసి స్కోరును 354 వరకు తీసుకెళ్లాడు. అంత పెద్ద లక్ష్యం జింబాబ్వేకు అసాధ్యంగా మారింది. బౌలింగ్‌లో ఈసారి కెప్టెన్ ఆయుష్ మాథ్రే మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను టోర్నీలో బలమైన స్థితిలో నిలబెట్టాడు. భారత్ 204 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ వచ్చింది. సెమీఫైనల్ చేరాలంటే పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి. భారత్ కేవలం 252 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్థాన్‌కు 33 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఆరంభంలో బాగానే మొదలుపెట్టినా, చివర్లో రిస్క్ తీసుకోవాల్సి రావడంతో వికెట్లు వరుసగా కూలిపోయాయి. 151కి 2 వికెట్ల స్థితి నుంచి 194కే ఆలౌట్ అయ్యారు. భారత్ 38 పరుగుల తేడాతో గెలిచి, అజేయంగా నాకౌట్‌కు అడుగుపెట్టింది.
READ MORE: Navy Officer Missing: చైనా వెళ్తున్న ఓడలో ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ భారత్‌కు గట్టి సవాల్ విసిరింది. వారి బ్యాటర్లు రెండు సెంచరీలు చేసి 310 పరుగుల భారీ స్కోరు నిలబెట్టారు. ఈ లక్ష్యం భారత్‌ను కాస్త ఒత్తిడిలోకి నెట్టింది. కానీ వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ ఆరంభంలోనే ధైర్యంగా ఆడారు. ఇద్దరికీ ఒక్కోసారి లైఫ్ లభించగా, దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. సూర్యవంశీ 33 బంతుల్లో 68 పరుగులు చేసి బలమైన పునాది వేశాడు. మాథ్రే వచ్చి 62 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది ఆరోన్ జార్జ్. అద్భుతమైన షాట్లతో 115 పరుగులు చేసి, భారత్‌ను రికార్డు రన్‌చేజ్ వైపు నడిపించాడు. దాదాపు 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇలా ప్రతి మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు ముందుకు వచ్చి జట్టును నడిపించడంతో భారత్ ఫైనల్ వరకు అజేయంగా చేరింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే తుది పోరులో మరోసారి ప్రపంచకప్ అందుకునే అవకాశం భారత్ ముందు ఉంది. ఈ ప్రయాణం చూస్తే, టైటిల్ గెలవాలనే కసితో భారత జట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. ఫైనల్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి!
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!