Vijayawada: రేపు మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటన.. పోలీసుల ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: రేపు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి నుంచి కనదుర్గమ్మ వారధి మీదుగా కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా జోగి ఇంటికి వెళ్లేందుకు పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే రూట్ మ్యాప్‌ను పార్టీ పోలీసులకు ఇచ్చింది. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి ఇంటికి వెళ్ళాలని నోటీసులు ఇచ్చినట్లు విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకీ రేపు జగన్ ఏ రూట్‌లో వెళ్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు రూట్ మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
READ MORE: T20 World Cup 2026: ఈసారి టీ20 వరల్డ్ కప్ మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇదిలా ఉండగా.. కూటమి కార్యకర్తల దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ ఇంటికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లనున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ కుటుంబీకులను జగన్ పరామర్శించనున్నారు. రేపు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఏం జగనుందో అన్న ఉత్కంఠ మొదలైంది.
READ MORE: మరింత అందుబాటులో కొత్త Hyundai i20.. రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్!
తాజావార్తలు
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..