Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ నటుడు సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ సమర్పిస్తోంది. గత ఏడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా ఘనవిజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమ్మర్ కానుకగా 2026, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ఈ చిత్రం ఫాంటసీ, హార్రర్.. హిలేరియస్ కామెడీతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్.. గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇందులో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, సంగీత్ శోభన్ కెరీర్‌లో సోలో హీరోగా ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. వేసవి సెలవుల్లో కుటుంబం అంతా కలిసి నవ్వుకునేలా ఈ ‘రాకాస’ సందడి చేయనుంది.
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!