Dhurandhar 2: ధురంధర్-2లో డైరెక్టర్ సతీమణి.. టర్నింగ్ పాయింట్‌గా నిలిచే క్యామియో రోల్!
- ధురంధర్ 2పై భారీ అంచనాలు
- మార్చి 19న థియేటర్లలో ధురంధర్ 2 విడుదల
- ధురంధర్ 2లో డైరెక్టర్ సతీమణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yami Gautam To Act in Dhurandhar 2: బాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతున్న యాక్షన్ డ్రామా మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’. ధురంధర్ ఊహించని హిట్ అందుకోవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ధురంధర్ 2 సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే పార్ట్ 2పై భారీ అంచనాలు ఉండగా.. ఓ బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు మరింత హైప్‌ను పెంచుతున్నాయి.
ధురంధర్ 2 సినిమాలో హీరోయిన్ యామీ గౌతమ్ కీలకమైన యాక్షన్ ప్యాక్డ్ క్యామియో రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచే పాత్రగా ఆమె క్యారెక్టర్ ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్యామియో కోసం యామీ దాదాపు ఐదు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ.. ఆమె పాత్రకు మంచి ఇంపాక్ట్ ఉండబోతుందని అంటున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ అన్న విషయం తెలిసిందే. మంచి రోల్ కావడంతో తన సతీమణినే పార్ట్ 2లో రంగంలోకి దించాడట.
Also Read
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. గతంలో ఈ జంట కలిసి చేసిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ఆర్టికల్ 370’ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దేశభక్తి, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాల్లో యామీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ధురంధర్ 2 పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రతీకారం, శక్తివంతమైన పాత్రలు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్. యామీ క్యామియోతో పాటు మరిన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయని సమాచారం.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..