World Cancer Day 2026: ఈ ఆహారం తినండి.. క్యాన్సర్‌కు దూరంగా ఉండండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cancer Day 2026: క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. అయితే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేడు ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day 2026) సందర్భంగా క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషించే ఆహారాలపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.. వైద్య శాస్త్ర పరిశోధనల ప్రకారం, క్యాన్సర్ మరణాల్లో ఎక్కువ శాతం.. తప్పుడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకర జీవనశైలి వల్లే సంభవిస్తున్నాయి. ప్రజలు తెలియకుండానే క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహించే ఆహారాలను తీసుకుంటూ, క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహారాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
భారత ప్రభుత్వానికి చెందిన మహాత్మా జ్యోతిబా ఫూలే జన్ ఆరోగ్య యోజన అధికారిక వెబ్సైట్ కూడా “క్యాన్సర్ వ్యతిరేక ఆహారం” ప్రాధాన్యతను స్పష్టంగా సూచిస్తోంది.
Also Read
- Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
- Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
- Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
మొక్కల ఆధారిత ఆహారం తీసుకోండి
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన ఆయుధం మొక్కల ఆధారిత ఆహారం. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు తక్కువ కొవ్వుతో పాటు అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ భోజనంలో కనీసం మూడింట రెండు వంతులు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలతో నింపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫైబర్ అధికంగా తీసుకోండి
ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, శరీరంలోని హానికర విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్.. తెల్ల బ్రెడ్‌కు బదులుగా తృణధాన్యాల బ్రెడ్.. పండ్లు, కూరగాయలను తొక్కలతోనే తినడం వంటి అలవాట్లు ఫైబర్‌ను పెంచుతాయి.
మాంసాహారం, కొవ్వు వినియోగం తగ్గించండి
అధిక మాంసాహారం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారంలో ఫైబర్ తక్కువగా, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మాంసం తీసుకోవాల్సి వస్తే దానిని ప్రధాన ఆహారంగా కాకుండా పరిమితంగా తీసుకోవాలి. డాల్డా, వెన్న, ప్రాసెస్డ్ ఆహారాల్లో ఉండే ట్రాన్స్ కొవ్వులను తగ్గించి, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్ వంటి ఆరోగ్యకర నూనెలను వినియోగించాలి. ఒమేగా–3 కొవ్వు ఆమ్లాల కోసం అవిసె గింజలు, వాల్నట్స్, చేపలను ఆహారంలో చేర్చాలి.
యాంటీఆక్సిడెంట్లు, సుగంధ ద్రవ్యాలు కీలకం
మీ భోజనం ఎంత రంగురంగులంగా ఉంటే, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మీ రక్షణ అంత బలంగా ఉంటుంది. రంగురంగుల పండ్లు, కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా వెల్లుల్లి, అల్లం, పసుపు, కరివేపాకు వంటి వంటగది సుగంధ ద్రవ్యాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
వంట పద్ధతి కూడా ముఖ్యం
ఆహారం ఏమి తింటున్నామనే దానితో పాటు, ఎలా వండుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. కూరగాయలను ఎక్కువసేపు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి. కాబట్టి తేలికగా ఆవిరి చేయడం మంచిది. మాంసాహారాన్ని నేరుగా మంటపై కాల్చడం లేదా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్‌కు దారితీసే రసాయనాలు ఏర్పడతాయి. అందుకే బేకింగ్, ఉడకబెట్టడం వంటి పద్ధతులను అనుసరించడం ఆరోగ్యకరం. అయితే, క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేకపోయినా, సరైన ఆహారం, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా దాని ప్రమాదాన్ని మాత్రం తప్పకుండా తగ్గించుకోవచ్చు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకొని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిద్దాం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!