Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్‌స్టీన్ ఫైల్‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు
- ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఎప్‌స్టీన్ ఫైల్
- ఎప్‌స్టీన్ ఫైల్‌పై అడ్వాన్స్‌గా యూకే ప్రధాని క్షమాపణలు
- ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికాతో పాటు ఆయా దేశస్థుల్లో వణుకుపుట్టిస్తోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా ఫైల్‌లో బడా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రపంచం వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నాయకులంతా ఈ కుంభకోణంలో ఉన్నట్లు వెల్లడైంది.
ఆశ్చర్యకరంగా ఎప్‌స్టీన్ ఫైల్‌లో పేరు లేకపోయినా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. బహిరంగంగా ఎప్‌స్టీన్ ఫైల్‌పై క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. పేరు లేకపోయినా హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
అసలేం జరిగిందంటే..
అయితే కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఇరాకటంలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత లేబర్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో లార్డ్ పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో రాయబారిగా నియమించారు. ఈ రాయబారికి ఎప్‌స్టీన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం కీర్ స్టార్మర్‌కు తెలిసే నియామకం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
ఎప్‌స్టీన్‌తో మాండెల్సన్ సంబంధాలు..
ఇక ఎప్‌స్టీన్ బాలికలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని నిర్ధారణ జరిగి దోషిగా తేలినప్పటికీ లార్డ్ పీటర్ మాండెల్సన్ అతడితో స్నేహం కొనసాగించినట్లుగా తేలింది. దీంతో గత సెప్టెంబర్‌లో మాండెల్సన్‌ను రాయబారిగా కీర్ స్టార్మర్ తొలగించారు. తాజాగా నియామకంపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాన్ని సహించబోమని.. ఎవరూ జవాబుదారీతనానికి అతీతులు కారని పేర్కొన్నారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న చాలా మంది వైఫల్యాలను స్టార్మర్ అంగీకరించారు. ఎప్‌స్టీన్ తనకు అంతగా పరిచయం లేదని మాండెల్సన్ తన దగ్గర అబద్ధాలు చెప్పారని.. ఆయన మాటలు నమ్మి రాయబారిగా నియమించినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు.

లార్డ్ పీటర్ మాండెల్సన్ కుంభకోణం
ఇదిలా ఉంటే లార్డ్ పీటర్ మాండెల్సన్ 2008లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మాండెల్సన్ అత్యంత రహస్య ప్రభుత్వ సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు అందజేసినట్లుగా ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో వెల్లడైంది. అంతేకాకుండా మాండెల్సన్-ఎప్‌స్టీన్ మధ్య వందలాది టెక్ట్స్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ సందేశాలు ఉన్నాయి. 2003లోనే ‘‘నా బెస్ట్ ఫ్రెండ్’’ అని మాండెల్సన్ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఇక ఎప్‌స్టీన్ నుంచి చాలా నగదు అందుకున్నట్లుగా బహిర్గతం అయింది. ఆదివారం లేబర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదని.. గుర్తులేదని మాండెల్సన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉన్నాడు. ఇక మంగళవారం హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి వైదొలిగాడు. ఇటీవల న్యాయశాఖ విడుదల చేసిన ఫొటోల్లో గుర్తుతెలియన మహిళతో మాండెల్సన్ ఉన్నట్లుగా కనిపించింది.

స్టార్మర్‌కు ఇక్కట్లు..
ఇక మాండెల్సన్ కుంభకోణం బయటకు వచ్చాక ప్రధాని కీర్ స్టార్మర్‌పై లేబర్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సొంత పార్టీ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజీనామా చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్తగా కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!