Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఆ తేదీల్లో ప్రచారానికి పవన్ రాక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాజలింగం, ఆర్‌కే సాగర్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
మరోవైపు.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓ వైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కాగా.. బీజేపీ సంచలన ప్రకటన చేసింది. మొన్న(మంగళవారం) తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సమావేశం అనంతరం రామచందర్‌రావు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యాం. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాం. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారు. ఇది తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు తిరుగులేని వేగాన్ని అందిస్తుంది.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
READ MORE: Best Selling Cars: అమ్మకాల్లో Tata Nexon దూకుడు.. జనవరిలో బెస్ట్‌సెల్లింగ్ కార్ల జాబితా ఇదిగో!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..