CM Revanth Reddy : వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!
- రైతులకు బోనస్‌తో సాగుకు భరోసా
- రుణమాఫీతో 25 లక్షల మందికి లాభం
- మహిళలకు పాలపిట్ట చీరలు, వడ్డీలేని రుణాలు
- 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు గూడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇది కేవలం అధికార మార్పిడి కాదని, పేదవాడి ఆకాంక్షల ప్రతిరూపమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యంగా రైతులకు సాగుపై నమ్మకం కలిగించడం , మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
గత ప్రభుత్వ హయాంలో వరి పండించడంపై ఆంక్షలు విధించి రైతులను ఆందోళనకు గురిచేస్తే, ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యం సన్న వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ ఒక్క నిర్ణయం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటం గతంలో ఎన్నడూ చూడని పరిణామం. రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల మేర రుణ విముక్తి కలిగించామని, రాబోయే రోజుల్లో మిగిలిన వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కూడా వేగవంతమైందని, అన్నదాతను రాజును చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంక్షేమం విషయానికి వస్తే, గత ప్రభుత్వం నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి భిన్నంగా, నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన ‘పాలపిట్ట’ చీరలను నేయించి ఆడబిడ్డలకు సారెగా అందజేస్తున్నామని చెప్పారు. కేవలం చీరలకే పరిమితం కాకుండా, మహిళా సమాఖ్యల ద్వారా లక్షలాది మందికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని తెలిపారు. ఇక పేదవాడి సొంతింటి కల విషయానికి వస్తే, 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించే యజ్ఞం మొదలైందని, స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల సహాయం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మార్పు కేవలం ఆరంభమేనని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెజాన్ సేల్‌లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!