Ragi Appalu Recipe: హెల్తీ, క్రిస్పీ.. వంటరాని వారు కూడా ఇంట్లోనే సులువుగా చేసే హెల్తీ ‘రాగి అప్పాలు’.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Appalu Recipe: ఇంట్లోనే సులువుగా చేసుకునే ఒక హెల్తీ స్నాక్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే రాగి అప్పాలు తప్పకుండా ట్రై చేయాల్సిందే. క్రిస్పీగా, క్రంచీగా ఉండే ఈ రాగి అప్పాలు రుచిలో టాప్ మాత్రమే కాకుండా ఆరోగ్యం అందించడంలో బెస్ట్ గా నిలుస్తుంది. పిల్లలకైనా.. పెద్దలకైనా.. చక్కని హెల్తీ స్నాక్ ఇది. ముఖ్యంగా వంటలో కొత్తవాళ్లు కూడా చాలా సులువుగా చేసేయడం దీని స్పెషల్. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దామా..
Lawyer M*urder: ఆస్తి కోసం సొంత చెల్లినే కిరాతకంగా!
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, నాలుగు యాలుక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో ఒకటిన్నర కప్పు రాగి పిండి, అదే కప్పుతో అర కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి, రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు, పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు స్టవ్‌పై ఒక పాన్ పెట్టి, అందులో ఒక కప్పు తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉంచాలి. దీనికి పాకం అవసరం లేదు. బెల్లం కరిగితే చాలు. స్టవ్ ఆపి ఈ బెల్లం నీటిని రాగి పిండి మిశ్రమంలోకి వడకట్టి వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ.. పిండి ముద్దను మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్ కాకుండా మీడియం కన్సిస్టెన్సీకి తీసుకురావాలి.
Ind vs SA: బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా బ్యాటర్స్! సౌతాఫ్రికాకు భారీ టార్గెట్..
అలా చేసిన దానిని ఈ పిండిపై మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని, బటర్ పేపర్ పై కొద్దిగా నెయ్యి రాసి, చేతులకు కూడా నెయ్యి అప్లై చేసుకుని మీడియం మందంతో చక్కలలా ఒత్తుకోవాలి. స్టవ్ పై ఆయిల్ ను మీడియం హీట్‌లో వేడి చేసి, ఒక్కసారి మూడు లేదా నాలుగు అప్పాలు వేసి, రెండు వైపులా ఈవెన్‌గా వేగేంతవరకు ఫ్రై చేయాలి. వేయించేటప్పుడు అప్పాలు పొంగుతున్నట్టు అనిపిస్తే ఫోర్క్‌తో చిన్న హోల్స్ చేస్తే మంచిది. అలా వేడివేడిగా తీసిన వాటిని కాస్త చల్లారాక తీసుకుంటే రాగి అప్పాలు క్రన్చీగా అద్భుతమైన టేస్ట్ ఇస్తాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. హెల్తీగా, టేస్టీగా ఉండే ఈ రాగి అప్పాలను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చేసి చూసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు.
తాజావార్తలు
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!