CM Revanth Reddy: గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు.
READ MORE: CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా.. గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్.. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ఈ తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!