Vivo V70 Launch: 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరా.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ‘వివో వీ70’ హై వోల్టేజ్ ఎంట్రీ!
- స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన వివో
- 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరా
- ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వివో వీ70 హై వోల్టేజ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V70 and V70 Elite Launch in India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి సంచలనం సృష్టించేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ సిద్ధమైంది. వివో వీ70 (Vivo V70), వివో వీ70 ఎలైట్ (Vivo V70 Elite) మోడళ్లను ఫిబ్రవరి 19న భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, ఫ్లాగ్‌షిప్ కెమెరాలతో ఈ రెండు ఫోన్లు మిడ్-రేంజ్, ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఈ వివో ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
వివో వీ70లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇది డేలీ యూజ్‌తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు మంచి పనితీరును ఇస్తుందని అంచనా. వివో వీ70 ఎలైట్‌లో మరింత పవర్‌ఫుల్ Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను ఇస్తోంది. అంతేకాదు ఈ మోడల్‌లో మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉండటంతో మరింత ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. డిస్‌ప్లే విషయంలో రెండు ఫోన్లలో ఒకే తరహా స్పెసిఫికేషన్లు ఉన్నాయి. 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తాయి. కలర్ అక్యురసీ, బ్రైట్నెస్, స్మూత్ స్క్రోలింగ్ విషయంలో వివో ఈసారి మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
స్టోరేజ్ పరంగా కూడా వివో భారీ అప్‌గ్రేడ్ ఇచ్చింది. రెండు మోడళ్లలోనూ UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది వేగవంతమైన యాప్ ఓపెనింగ్, డేటా ట్రాన్స్‌ఫర్, గేమింగ్ లోడింగ్ టైమ్‌లను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. రెండింటిలో 6500mAh భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అవ్వడంతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్ అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్లను రూపొందించారు. అదనంగా IP69 రేటింగ్ ఉండటంతో నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్లు పూర్తి రక్షణ పొందుతాయి.
Also Read: Suryakumar Yadav: పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ సిద్ధం.. కొలంబో ఫ్లైట్ బుక్ అయింది!
కెమెరా విభాగంలో వివో వీ70 సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP 3x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా అందించడం విశేషం. ఫోటోగ్రఫీ, వీడియో కంటెంట్ క్రియేషన్‌లో ఈ సెటప్ గట్టి ఇంపాక్ట్ చూపనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ రెండు ఫోన్లు లేటెస్ట్ Android 16తోనే లాంచ్ అవుతున్నాయి. అంతేకాదు 4 సంవత్సరాల Android OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని వివో తెలిపింది. ఫిబ్రవరి 19 లాంచ్‌తో భారత మార్కెట్‌లో ఈ ఫోన్స్ హాట్ టాపిక్ అవడం ఖాయం. పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ కెమెరాలతో ఈ సిరీస్ మిడ్-రేంజ్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు వివో స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..