WPL 2026 Final : విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. స్మృతి మంధాన ఊచకోత.!
- ఢిల్లీ భారీ స్కోర్ 203 పరుగులు
- మంధాన–వోల్ 165 పరుగుల భాగస్వామ్యం
- 41 బంతుల్లో 87తో మంధాన విధ్వంసం
- 19.4 ఓవర్లలో టైటిల్ కైవసం చేసుకున్న ఆర్‌సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్‌సీబీ, గతేడాది సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లోనే 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పటిష్టమైన పునాది వేయగా, ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ 44 పరుగులు, చినెల్ హెన్రీ మెరుపు వేగంతో 35 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే , నడైన్ డిక్లార్క్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ పడగొట్టారు.
Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
అయితే, 204 పరుగుల సునాయాసంగా లేని లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోవడంతో కొంత ఆందోళన కలిగింది. కానీ, ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన , జార్జియా వోల్ కలిసి విధ్వంసాన్ని సృష్టించారు. స్మృతి మంధాన కేవలం 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్ల ఆశలను నీరుగార్చగా, మరోవైపు జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. మైదానంలోని ప్రతి మూలకు బౌండరీల వర్షం కురిపిస్తూ వడోదర స్టేడియాన్ని హోరెత్తించారు.
మ్యాచ్ ముగింపు దశలో వోల్, రిచా ఘోష్ , మంధాన వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఢిల్లీ మళ్ళీ పోరాటంలోకి వచ్చినట్టు అనిపించినా, అదృష్టం మాత్రం ఆర్‌సీబీ పక్షానే నిలిచింది. ముఖ్యంగా 19వ ఓవర్‌లో మిన్ను మణి ఒక సులభమైన క్యాచ్‌ను చేజార్చడం ఢిల్లీ విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీకి విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా, ఒత్తిడిని అధిగమించిన రాధా యాదవ్ వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు బాది 19.4 ఓవర్లలోనే జట్టును విజేతగా నిలిపింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా మిగిలిపోవాల్సి రావడం గమనార్హం. ఆర్‌సీబీ తన నిలకడైన ఆటతీరుతో మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుని తన అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!