Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిసిందే. ఈ ఉత్కంఠ బరిత సన్నివేశం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశంపై సైతం చర్చలు జరుగుతున్నాయి. 2025లో భారత్ రియల్ ఎస్టేట్ రంగం మరింత బలంగా ముందుకు సాగింది. దేశ ఆర్థిక వృద్ధికి ఇది ఒక కీలక స్థంభంగా మారింది. ప్రభుత్వం…
మనమంతా రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో లడాఖ్‌లో ఒక జవాన్ మంచు తుఫానులో నిలిబడి ఉంటాడు. రాజస్థాన్ ఎడారిలో మరో జవాన్ 45 డిగ్రీల వేడిలో గస్తీ కాస్తుంటాడు. సముద్రం మధ్యలో నౌకపై ఇంకొకరు కంటిపాపలా దేశాన్ని కాపాడుతుంటారు. మనకు ఈ దేశం సురక్షితంగా అనిపించడానికి కారణం రాజకీయ నాయకుల స్పీచులు కాదు..సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న త్రివిధ దళాల యోధులు. మరోవైపు ఇండియా సరిహద్దులు ఇప్పుడు ప్రశాంతంగా లేవు. ఓవైపు చైనా నుంచి…
రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు చాలామందికి అదనపు ఆదాయం కాదు. అదే జీవనాధారం. బ్యాంక్‌లో వేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే మందులు కొనాలి, కిరాణా సరుకులు తీసుకోవాలి, ఇంటి రోజువారీ ఖర్చులు చూసుకోవాలి. కానీ ఇలాంటి వడ్డీ ఆదాయంపై ఇచ్చే పన్ను రాయితీలు సంవత్సరాలుగా మారలేదు. మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఫిబ్రవరి…
Budget 2026: దేశ కేంద్ర బడ్జెట్–2026 కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. అనుభవజ్ఞులు, కొత్త ముఖాల కలయికతో కూడిన బడ్జెట్ బృందం ఈ కీలక బాధ్యతను భుజాన వేసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది మోడీ 3.0 ప్రభుత్వానికి మూడవ పూర్తి బడ్జెట్ కావడం విశేషం. ఈసారి ఫిబ్రవరి…
బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ 2026 బడ్జెట్‌ను చూసే జెన్-జీ దృష్టి అక్కడితో ఆగడం లేదు. ఉద్యోగ భద్రత లేని ప్రపంచంలో పెరిగిన తరం ఇది. కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, క్లైమేట్ మార్పులు అన్నింటినీ చిన్న వయసులోనే చూసింది. అందుకే ఈ తరం ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు భిన్నంగా ఉన్నాయి. జీతం ఎంత వస్తోందన్నదాని కంటే, ఆ జీతంతో జీవించగలుగుతున్నామా? మానసిక ఆరోగ్యానికి భద్రత ఉందా?…
Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో ఏం ఉంటుందని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026(ఆదివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైంది. అయితే, ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. మొదటిదశ సమావేశాలు జనవరి 28 నుంచి…
Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026కు ముందు ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వం వద్ద కీలక డిమాండ్లను పెడుతుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే దిగుమతి కార్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని సవరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
కేంద్ర బడ్జెట్ 2026కి ముందు పెన్షనర్లకు ఓ శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచారం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి సంబంధించిన పెన్షనర్ల కోసం బడ్జెట్లో లేదా బడ్జెట్ తర్వాత గానీ కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
బడ్జెట్(Union Budget 2026) దగ్గర పడిన ప్రతిసారి పన్ను రాయితీలు, సబ్సిడీలపైనే చర్చ నడుస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం దృష్టి మరో వైపు కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న మహిళలకు నిజంగా ఆ అకౌంట్ ఉపయోగపడుతోందా అనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది. కోట్లాది మహిళల పేర్లపై జనధన్ అకౌంట్లు ఉన్నాయి. కానీ వాటిలో చాలావరకు యాక్టివ్‌గా లేవు. డబ్బు జమ చేయడానికి మాత్రమే కాదు, అప్పు తీసుకోవడానికి, ఇన్సూరెన్స్ భద్రత పొందడానికి ఆ అకౌంట్లు ఎంతవరకు…
ప్రతి బడ్జెట్ ముందు ఇండియన్ మిడిల్ క్లాస్ వర్గంలో ఒకే రకమైన ఆలోచనా విధానం కనిపిస్తుంది. ఈసారి అయినా ట్యాక్స్ ఫైలింగ్ సులభం అవుతుందా? డాక్యుమెంట్ల పని, నోటీసులు, గందరగోళం తక్కువవుతాయా? నిజానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే బాధ్యతను ఎవరూ తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఆ బాధ్యత అర్థం కాని డాక్యుమెంట్లు, మారుతున్న నిబంధనల మధ్య భయంగా మారకూడదన్నదే ఉద్యోగులు, మధ్యతరగతి కోరుకుంటోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు ముందు ఈ ఆశలు మరింత గట్టిగా…