Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 05 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 5, 2026 , 9:14 pm
By Gogikar Sai Krishna
  • ఖర్గేపై ప్రధాని సెటైర్లు.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్..
  • రేపు మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటన.. పోలీసుల ఆంక్షలు
  • ఏపీలో జనాభా లెక్కల సేకరణకు డేట్ ఫిక్స్
  • వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహారాల్లో పాల్గొనకుండా మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌పై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు నేడు (ఫిబ్రవరి 5) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు 2017 జనవరి ఆదేశాలను సవరించి ఇకపై నియమాలు, నిబంధనలకు అనుగుణంగా ఠాకూర్ బీసీసీఐ (BCCI) కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. 2017 జనవరిలో సుప్రీంకోర్టు అనురాగ్ ఠాకూర్‌ను బీసీసీఐ వ్యవహారాలకు దూరంగా ఉండాలని (“cease and desist”) ఆదేశించింది. అప్పుడు ఐసీసీ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్‌కు లేఖ రాసిన విషయంపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు అవమాన (Contempt), అబద్ధ ప్రమాణం (Perjury) కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఠాకూర్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరై క్షమాపణ తెలిపారు. దీంతో 2017 జూలై 14న సుప్రీంకోర్టు ఆయనపై కేసులను రద్దు చేసింది.

ఖర్గేపై ప్రధాని సెటైర్లు.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల యూరోపియన్ యూనియన్, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభలో వివరించారు. దేశం అన్ిన రంగాల్లో అభివృ‌ద్ధి చెందుతోందని, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ గొంతకుగా మారిందని అన్నారు. కాంగ్రెస్ తప్పులు సరిదిద్ధడానికి చాలా సమయం పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధానులకు ముందు చూపు లేనందున భారత అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై సెటైర్లు వేశారు. ప్రధాని ప్రసంగంగా ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ఆ సమయంలో ఖర్గే తన స్థానంలో నిలబడి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఖర్గే ఆయన వయసు దృష్ట్యా కూర్చుని నినాదాలు చేయవచ్చు’’ అని సూచించారు. ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు అలసిపోయి వెళ్లిపోయాయని ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ధ్వజం..

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల పలు దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభకు వివరించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య సభలో ప్రధాని ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే, ప్రధాని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్షాలకు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు. రాజ్యసభలో చర్చ జరిగే సమయంలో విపక్షాలు హుందాగా ఉండాలని, కానీ వారు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 9 దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని ప్రధాని వెల్లడించారు.

ఏడుపాయల మహాజాతర.. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు..

తెలంగాణ రాష్ట్రంలోనే మేడారం జాతర తర్వాత అత్యంత వైభవంగా జరిగే రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ సాక్షిగా, ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం , ఆలయ కమిటీ సర్వ సిద్ధం చేస్తోంది. మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి, అమ్మవారి పాదాల చెంత నుంచి ప్రవహించే ఈ పవిత్ర క్షేత్రానికి ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు.

స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్

వైసీపీ, మాజీ సీఎం జగన్‌ను నాశనం చేయాలని సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. దానికోసం ఇప్పటి దాక వ్యవస్థలను వాడుకున్నారు‌.. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు అనేలా చంద్రబాబు, పవన్, బీజేపీ ‌నేత మాధవ్ ప్రెస్ మీట్ ఉందన్నారు. తప్పులు చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేస్తే.. ఉలిక్కిపడి చంద్రబాబు ఈరోజు ముగ్గురు నేతలను తీసుకుని వచ్చారన్నారు. అవసరం అయితే గొడ్డు మాసం తింటాను అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారన్నారు. స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా?.. ఇంకా ఎవరు లేరా‌? అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలోనే వేలాది ఆలయాలు కూల్చివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మద్యం అమ్మారని.. బిర్యానీ తిన్నారన్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలా ఎన్నో దారుణాలు జరిగాయని విమర్శించారు..

వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇది కేవలం అధికార మార్పిడి కాదని, పేదవాడి ఆకాంక్షల ప్రతిరూపమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యంగా రైతులకు సాగుపై నమ్మకం కలిగించడం , మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.

ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లడ్డూ వివాదంపై పేర్ని నాని ఆగ్రహం

కూటమి ప్రభుత్వం ముసుగులో నారా చంద్రబాబు ప్రభుత్వం ఉందని.. ఇంతకీ చంద్రబాబు, పవన్, మాధవ్, కేశవ్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.. లడ్డూ వివాదంపై తాజాగా మాజీ మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేశవ్ తన ఆర్థిక శాఖ గురించి, ప్రభుత్వ అప్పుల గురించి పట్టదు. ఆ శాఖను ఆయన నడుపుతారా.. చంద్రబాబు నడుపుతారా తెలియదన్నారు.. కెమికల్స్ కలిపి ఆవు నెయ్యి కలిపారని చెప్పిన కేశవ్.. తక్కువ ధరలకు నెయ్యి కొన్నారు కాబట్టి అది కల్తీ నెయ్యి అంటున్నారన్నారు.. వారి ప్రభుత్వంలోనే హర్ష్ డెయిరీని ఇన్స్పెక్షన్ చేసి అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని అప్రూవ్ చేశారని ఆరోపించారు. అక్టోబర్ 2018 మాకేం సంబంధం.. ఫిబ్రవరి 2019 మాకేం సంబంధం అన్నారన్నారు.. మరి మే 2019 లో కేబినెట్ ఎలా పెట్టారు? అని ప్రశ్నించారు. మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలో చాలా నిర్ణయాలు కూడా తీసుకున్నారు.. హర్ష్ ఫ్రెష్ డెయిరీ నుంచి 291 రూపాయలకు టీడీపీ కొనుగోలు చేసింది.. మరి ఇది భోలే బాబా డెయిరీ నే కదా? అని నిలదీశారు. 319, 329 తప్పన్నారు.. తాము రావటానికి రెండు నెలల ముందు 291కి వాళ్ళు ఎలా కొనుగోలు చేశారని చెప్పారు..

బొగ్గుగనిలో పేలుడు.. 16 మంది కార్మికులు మృతి, కొనసాగుతున్న రక్షణ చర్యలు!

మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించి 16 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక పరిపాలన అధికారులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. తాశఖై ప్రాంతంలోని కోయిల గనిలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో గనిలో ఉన్న కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. ఇంకా కొంతమంది కార్మికులు గనిలో చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. మృతులందరూ అస్సాం రాష్ట్రానికి చెందిన కార్మికులేనని ప్రాథమిక సమాచారం.

ఏపీలో జనాభా లెక్కల సేకరణకు డేట్ ఫిక్స్

AP Census: జనాభా లెక్కల సేకరణ-2027పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గత జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగిందని తదుపరి జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9నుంచి 28 వరకూ జరగనుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు.రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని వెల్లడించారు. దేశంలో జనాభా లెక్కల సేకరణ నేపధ్యాన్ని వివరిస్తూ 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యానంతరం నిర్వహించే 8వ జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ ప్రత్యేకతల గురించి వివరిస్తూ పోర్టల్స్, యాప్స్ ద్వారా నిర్వహించే డిజిటల్ సెన్సస్ అని డిజిటల్ సెన్సస్ అనగా డేటా సేకరణ, నిర్వహణ, మానిటరింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే సెల్ఫ్ ఎన్యుమరేషన్, కుల గణన, జియో రిఫరెన్సు మ్యాపులు, కృత్రిమ మేధను ఉపయోగించి వేగవంతంగా డేటా డెస్సిమినేషన్ వంటి చర్యలు తీసుకుంటారని వివరించారు. డిజిటల్ సెన్సస్ కు సంబంధించి మొబైల్ యాప్స్, వెబ్ పోర్టళ్ళను 16 ప్రాంతీయ భాషల్లో రూపొందించండం జరుగుతోందని వివరించారు. అనంతరం జనాభా లెక్కల సేకరణ-2027 టైం లైన్ గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈనెలలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశం, ఫిబ్రవరి-ఏప్రిల్ మాసాల మధ్య మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డు ట్రైనర్లు, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

రేపు మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటన.. పోలీసుల ఆంక్షలు

రేపు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి నుంచి కనదుర్గమ్మ వారధి మీదుగా కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా జోగి ఇంటికి వెళ్లేందుకు పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే రూట్ మ్యాప్‌ను పార్టీ పోలీసులకు ఇచ్చింది. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి ఇంటికి వెళ్ళాలని నోటీసులు ఇచ్చినట్లు విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకీ రేపు జగన్ ఏ రూట్‌లో వెళ్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు రూట్ మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • Edupayala Jatara
  • telugu news
  • Top Headlines 9pm

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions