ఇటీవల కాలంలో తొలి చిత్రంతోనే స్టార్‌ అయిపోయిన హీరోయిన్లు కృతి శెట్టి, శ్రీలీల. ఇద్దరి ఏజ్‌ ఆల్మోస్ట్ సేమ్‌. ఒకరు ముందు, మరొకరు తర్వాత.. రచ్చ మాత్రం సేమ్‌. కానీ ఈ ఇద్దరి మధ్య చిన్న తేడా ఉంది. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల పరంగా ఎక్కువ చర్చ జరుగుతుందంటే అది శ్రీలీల గురించే. ఆమె ఒక్క సినిమాతోనే స్టార్‌ హీరోలతో నటించే ఆఫర్లు దక్కించుకోవడమే అందుకు కారణం. 

ఊహించని విధంగా ఆమె సూపర్‌ స్టార్లతోనూ జోడీ కడుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పది సినిమాలుండటం ఆశ్చర్యపరుస్తుంది. బిజీ, క్రేజీ , ఎనర్జిటిక్‌ హీరోయిన్‌గా నిలుస్తుంది శ్రీలీల. 

శ్రీలీలకి ఇన్ని ఆఫర్లు రావడానికి కారణం రాఘవేంద్రరావు తెరకెక్కించిన `పెళ్లిసందడి`. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించారు. ఇందులో శ్రీలీల అద్భుతమైన డాన్సులతో అదరగొట్టింది. అందంతోనూ మాయ చేసింది. 

రవితేజతో `ధమాఖా` సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇందులో శ్రీలీల డాన్సులు ఉర్రూతలూగించాయి. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుని దూసుకుపోతుంది. 

సరిగ్గా శ్రీలీల కెరీర్‌లాగానే మరో యంగ్‌ సెన్సేషన్‌ కృతి శెట్టి కెరీర్‌ సాగింది. కాకపోతే ఈ బ్యూటీ తొలి చిత్రమే సంచలన విజయం సాధించింది. `ఉప్పెన`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది కృతి శెట్టి. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. 

ఇటీవల కాలంలో తొలి చిత్రంతోనే స్టార్‌ అయిపోయిన హీరోయిన్లు కృతి శెట్టి, శ్రీలీల. ఇద్దరి ఏజ్‌ ఆల్మోస్ట్ సేమ్‌. ఒకరు ముందు, మరొకరు తర్వాత.. రచ్చ మాత్రం సేమ్‌. కానీ ఈ ఇద్దరి మధ్య చిన్న తేడా ఉంది. 

యంగ్‌ స్టర్స్ అంతా ఈ అమ్మడి వెంట క్యూ కట్టారు. వరుసగా నాని, నాగచైతన్య, రామ్‌, నితిన్‌, సుధీర్‌బాబు ఇలా వరుసగా ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తట్టాయి. నాగచైతన్యతో ఏకంగా రెండు సినిమాలు(బంగార్రాజు, కస్టడీ) చేసింది. 

నానితో చేసిన `శ్యామ్‌ సింగరాయ్‌` అంతంతగానే ఆడింది. నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` యావరేజే. మిగిలిన నాలుగైదు సినిమాలు బోల్తా కొట్టాయి. 

ఇప్పుడు తెలుగులో క్లీన్‌ స్వీప్‌ అయిపోయింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్‌ కూడా లేదు.  దీంతో తమిళం, మలయాళంపై ఫోకస్‌ చేసినట్టు సమాచారం. 

కృతి శెట్టి చేసిన పెద్ద పొరపాటు.. తొలి హిట్‌తో వచ్చే ఇమేజ్‌ని, క్రేజ్‌ని కంట్రోల్ చేసుకుని సినిమాల ఎంపికలో జాగ్రత్త వహించలేకపోవడం. మొదటిసారే ఊహించని క్రేజ్‌ రావడంతో ఆమెకి ఏం చేయాలో తోచలేదు. సరైన గైడింగ్ లేదు. 

శ్రీలీల చాలా తెలివిగా ముందుకెళ్తుంది. చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ లు సెట్‌ చేసుకుంది. ఆమె వరుసగా సినిమాలకు సైన్‌ చేసింది. కానీ తన చేతిలో ఉన్న అన్ని సినిమాలు ఆల్మోస్ట్ థియేటర్ల వద్ద గట్టిగా కొట్టేవే కావడం గమనార్హం. 

శ్రీలీల ఒకటి రెండు మినహా అన్ని భారీ హోప్స్ ఉన్న సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాలు కావడం విశేషం. ఈ సినిమా ఫలితాలు తేడా కొట్టినా, శ్రీలీల క్రేజ్‌ మాత్రం తగ్గదు కదా, మరింత పెరుగుతుంది. మరిన్ని పెద్ద ఆఫర్లు వస్తాయి. 

సో శ్రీలీల చాలా తెలివిగా, మంచి బలమైన కథలు, హిట్‌ కాంబోతో కూడిన కథలను ఎంపిక చేసుకుంది. తెలివిగా ముందుకు నడుస్తుంది. కృతి శెట్టిలా ఏది పడితే అది చేయడం లేదు. ఇదే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాని స్పష్టం చేస్తుంది. 

మరి కృతి కూడా తప్పులు తెలుసుకుని మంచి ప్రాజెక్ట్ లు ఎంపిక చేసుకుని మళ్లీ బిజీ అవుతుందా? అనేది చూడాలి.