IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
- రాజకీయాలు, ఫుల్ ఈగో
- గంభీర్‌పై జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ విమర్శలు
- భారత్ గెలిచే అవకాశాలు తక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andy Flower on IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఈరోజు భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సెమీస్ వైపు అడుగులు వేయాలంటే.. విజయం తప్పనిసరి. ముఖ్యంగా టీమిండియాకు విజయం మాత్రమే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ నేపథ్యంలో జింబాబ్వే మాజీ దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 160 లక్ష్యం ఉన్నా భారత్ ఒత్తిడికి గురవుతుందని, గెలిచే అవకాశాలు తక్కువ అని జోస్యం చెప్పారు.
‘మ్యాచ్ భారత్, జింబాబ్వే జట్లకు ఎంతో కీలకం. మంచి పోటీని అభిమానులు చూడాలని ఆశిస్తున్నా. భారత జట్టు ప్రదర్శన, ముఖ్యంగా చేజింగ్ సామర్థ్యంపై సందేహం ఉంది. జింబాబ్వే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 160 పరుగులు చేయాలి. పెద్ద స్కోర్ బోర్డుపై ఉంచితే.. భారత్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా 150కు పైగా లక్ష్యాన్ని ఛేదించడంలో ఇబ్బంది పడవచ్చు. గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం జింబాబ్వే మంచి క్రికెట్ ఆడుతోంది. విజయం భారత్‌కు అంత ఈజీ కాదు’ అని ఆండీ ఫ్లవర్ అన్నారు.
Also Read
- Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
- Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
- Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Also Read: Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్.. టాయిలెట్‌లో ఉన్న గంగూలీ బలి!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా ఆండీ ఫ్లవర్ తీవ్ర విమర్శలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రాజకీయాలు, ఈగో వల్ల భారత జట్టు వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోందన్నారు. గంభీర్ తీరుతో ఆటగాళ్లు పూర్తిగా కంఫర్ట్‌గా లేరన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవడం కష్టమని ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. టీంఇండియా అభిమానులు కొందరు ఫ్లవర్ వ్యాఖ్యలను ఖండిస్తుండగా.. మరికొందరు మాత్రం నిజమే అంటున్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!