Young Man D*ied with Heart Attack in Gym: జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Man D*ied with Heart Attack in Gym: ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది.. ఫుడ్ మారుస్తున్నారు.. ఉదయమే వాకింగ్, జాకింగ్.. వర్కౌట్స్ ఇలా.. వారి వీలును బట్టి సమయానికి కేటాయిస్తున్నారు.. మరోవైపు గుండెపోటు మరణాలు మాత్రం ఆగడం లేదు.. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా, చిత్తూరు జిల్లా పలమనేరులోని జిమ్ సెంటర్‌లో ఒక యువకుడు గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పలమనేరు పాతవపేటకు చెందిన విశ్వనాథ్, ఉదయం జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తున్న సమయంలో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు.. కొద్దిసేపటి తర్వాత జిమ్ బయటకు వచ్చి వాంతులు చేసిన అనంతరం, అతను మృతి చెందాడు.
Read Also: The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
అయితే, జిమ్‌లో సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం, రికవరీ సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన ఈ ఘటన జరిగినట్లు విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, ఆయన మృతి గుండెపోటు కారణంగా జరిగిందని ధృవపరిచారు. కాగా, విశ్వనాథ్ డీసీసీ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. యువకుడి ఆకస్మిక మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.. అయితే, జిమ్‌లో వ్యాయామం చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చూస్తున్నారు.. ముఖ్యంగా సరైన వ్యాయామ పథకాన్ని అనుసరించడం.. తగిన వైద్య పర్యవేక్షణ ఉండటం.. శారీరక పరిస్థితిని గమనించడం.. ఎటువంటి అసౌకర్యం కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవడం.. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..