Telangana Vehicle Price Hike: కొత్త వాహనాలు కొనే వారికి బిగ్ షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Vehicle Price Hike: కొత్తగా వాహనం తీసుకునే వాళ్లకు బిగ్ షాక్ వచ్చేసింది. తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
ఇదిలా ఉండగా.. కొత్తగా వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్‌ను గతేడాది ఆగస్టులో రవాణాశాఖ పెంచింది. ఖరీదైన వాహనాలపై ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై కొంతకాలం తర్వాత తెలంగాణకు మార్చుకునే పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా వాటి విలువను బట్టి 1-6 శాతం వరకు పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ 53, 54 జీఓలను గతేడాది ఆగస్టు 13న జారీ చేశారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం ద్విచక్ర వాహనాల శ్లాబులు రెండు నుంచి నాలుగుకు… కార్లు, జీపుల శ్లాబులు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు సైతం భారీగా పెరిగాయి. తాజాగా మరోసారి భద్రత పన్ను పేరిట వసూళ్లు చేపట్టడంతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.
READ MORE:Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?