రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

రొయ్యల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది.

రొయ్యల్లో ఉండే విటమిన్ B12.. బలహీనత, అలసట, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

రొయ్యలు తక్కువ కేలరీల పోషకాహారం. కాబట్టి.. బరువు తగ్గించుకోవడంలో రొయ్యలు దోహదపడుతాయి.

రొయ్యల్లో ఉండే జింక్, సెలీనియం.. మగవారిలో శృంగార సామర్థ్యాన్ని, వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి.

రొయ్యల్లో ఉండే మెగ్నీషియం.. కండరాల్ని బలపర్చడంలో దోహదపడుతుంది.

రొయ్యలలో కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

రొయ్యల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని ధృడంగా ఉంచడంలో తోడ్పడుతుంది.