Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల టాలీవుడ్ అంటేనే నడుము అందాల ప్రదర్శన అని, దర్శకులు కేవలం హీరోయిన్ల శరీర భాగాలపైనే దృష్టి పెడతారని గతంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సీ పన్ను మరోసారి అలాంటి కామెంట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. దక్షిణాది దర్శకులు హీరోయిన్లను ఆకర్షణీయంగా చూపించే క్రమంలో ‘ప్యాడెడ్ బ్రాలు’ ధరించమని ఒత్తిడి తెస్తారని, అది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో ‘క్లీవేజ్’ (Cleavage) పై దృష్టి పెడితే, సౌత్‌లో మాత్రం ‘నాభి’ (Navel) ప్రదర్శనపై ఫోకస్ చేస్తారని హేళనగా మాట్లాడింది. తన కామెంట్స్ పై తెలుగు ప్రేక్షకులు సినీ ప్రముఖులు ఆమెపై మండిపడ్డారు. దీంతో ఇప్పుడు ఆమె మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. చేసిన డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకే ఆమె ఇప్పుడు తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read :Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ట్రోల్స్ సెగ తగిలిందో ఏమో కానీ, వెంటనే తాప్సీ తన రూటు మార్చింది. మరో ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ.. తనకు నటిగా గుర్తింపు తెచ్చింది తెలుగు సినిమాలేనని, తమిళం (కోలీవుడ్) కంటే తెలుగు ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారని పొగడ్తలు కురిపించింది. దీంతొ సినిమా ప్రమోషన్ల కోసం వివాదాలు సృష్టించడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం తాప్సీకి అలవాటేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు “ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న” అనే సామెత ఆమెకు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!