Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం
- విజయంపై సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లు, అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన గత పోరు గురించి ఎక్కువగా ఆలోచించలేదని.. అన్నింటినీ పూర్తిగా పక్కనపెట్టామని వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన ఏడాది ప్రదర్శనను వీడియో అనలిస్ట్ తయారు చేసిన ప్రత్యేక స్లైడ్‌ను ఆటగాళ్లు చూపించాడని, ఆ వీడియోలు చూసి తాము ఎంతో పాజిటివిటీ పొందామని తెలిపాడు. వీడియోలు చూశాక సానుకూలమైన మైండ్ సెట్‌తో జింబాబ్వేపై బరిలోకి దిగాం అని సూర్య చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ నుంచి ఏడో స్థానం వరకూ బ్యాటర్లు అందరూ కలిసి బాధ్యతగా ఆడటం ఆనందంగా అనిపించింది. అయితే మా బౌలింగ్ మాత్రం బాలేదు. మరింత బాగా బంతులు వేయాల్సింది అని నిజాయితీగా అంగీకరిస్తున్నా. అయినప్పటికీ చివరికి విజయం సాధించాం కాబట్టి ఇప్పుడు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్‌ల్లో తప్పిదాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాము’ అని చెప్పాడు.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Rinku Singh Father Dead: రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం!
ప్రత్యర్థి జింబాబ్వే బ్యాటర్లను కూడా సూర్య ప్రశంసించాడు. ‘జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ.. పవర్‌ప్లేలో ఓపికగా ఆడి తర్వాత తెలివిగా రన్స్ చేశారు. వారి ఆట తీరుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. బౌలింగ్ పరంగా మాత్రం సరైన ఆప్షన్లు ఎంచుకోవడంలో ఇంకాస్త తెలివిగా ఉండాల్సింది. మొత్తానికి జింబాబ్వే మంచి క్రికెట్ ఆడింది. తదుపరి మ్యాచ్ కోసం కోల్‌కతా చేరుకున్నాక ప్రణాళికల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ప్రయాణంపై దృష్టి పెడతాము. కఠిన పరిస్థితుల్లో పాజిటివ్ దృక్పథమే విజయానికి దారి తీస్తుంది’ అని కెప్టెన్ సూర్య స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!