Virosh wedding : ఎట్టకేలకు ఒక్కటైన ‘విరోష్’.. నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా తెలుగు,కొడవ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు పూర్తయ్యాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలో ఈ జంట రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే.. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే రష్మిక తన సోషల్ మీడియా వేదికగా భర్త విజయ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Also Read:Toxic : రన్ టైం విషయంలో ‘ధురంధర్ 2’ తో పోటీ పడుతున్న ‘టాక్సిక్’..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
రష్మిక తన పోస్ట్‌లో విజయ్ దేవరకొండను తన భర్తగా పరిచయం చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.. ‘నా ప్రియమైన వారికి.. నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు నేర్పించిన వ్యక్తి.. ప్రశాంతంగా ఉండటం అంటే ఎలా ఉంటుందో చూపించిన మనిషి.. పెద్ద కలలు కనడం తప్పు కాదని నాకు ప్రతిరోజూ చెబుతూ, నా కలలను నిజం చేసుకోవడానికి నాకు తోడుగా నిలిచిన నా సర్వస్వం అతడు’ అంటూ రష్మిక రాసుకొచ్చారు. ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, ‘డియర్ కామ్రేడ్’తో బలపడి.. నేడు నిజ జీవితంలో ఒక్కటవ్వడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో #ViroshWedding అనే హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
Hi my loves,
Introducing to you now “My Husband”! 💘
Mr. Vijay Deverakonda!! ❤️
The man who taught me what true love feels like,
The man who showed me what being in peace feels like! 🤍
The man who told me everyday that dreaming big was absolutely ok and constantly telling… pic.twitter.com/MPrsGfNTwb— Rashmika Mandanna (@iamRashmika) February 26, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!