Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ #Varanasi (SSMB29) ఇప్పుడు షూటింగ్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం కేవలం విదేశాల్లోనే కాకుండా, హైదరాబాద్‌లోనే అత్యంత అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్స్, అందులో చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. ఈ చిత్రం ఇండియన్ ఎపిక్ రామాయణంతో బలమైన కనెక్షన్ కలిగి ఉండబోతోందని తెలుస్తోంది.
Also Read: Nikhil : ఓటీటీలోకి నిఖిల్ ఎంట్రీ.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదుగా!
Also Read
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం కోసం ఒక భారీ మోషన్ పిక్చర్ స్టూడియోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా, వర్చువల్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు. అయితే, అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో రామాయణ కాలానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. కథా గమనాన్ని మార్చే ఒక కీలక సన్నివేశం రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉంటుందని, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలను బట్టి సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీ పరంగా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మించిపోయేలా ఈ విజువల్ వండర్ ఉండబోతోందని స్పష్టమవుతోంది.
#MaheshBabu హీరోగా నటిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ “#Varanasi”ను #SSRajamouli అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక మోషన్ పిక్చర్ స్టూడియో ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
తాజాగా విడుదలైన వీడియో ప్రకారం, రామాయణ… pic.twitter.com/pwiWoDwW1E
— Tupaki (@tupaki_official) February 26, 2026
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!