Tilak Varma: తిలక్ వర్మ గ్రేట్ కంబ్యాక్.. విమర్శకుల నోళ్లకు తాళం వేసిన తెలుగు తేజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma: నిన్న జరిగిన మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మపై ఏ మేరకు చర్చలు జరిగాయో.. తెలుగు తేజం తిలక్ వర్మ అంశలోనూ అదే స్థాయిలో చర్చలు సాగాయి. తిలక్ బ్యాటింగ్ ఆర్డర్, ఫామ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. చెన్నైలో జింబాబ్వేపై జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో వాటికి తిలక్ చెక్ పెట్టేశాడు. విమర్శకుల నోళ్లను బ్యాట్‌తో మూయించేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు తిలక్ ప్రదర్శన నిరాశాజనకంగానే ఉంది. యూఎస్‌ఏ, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై అతని స్కోర్లు 25, 25, 25, 31, 1. ఈ స్కోర్ పెద్దగా తప్పుపట్టేలా లేకపోయినా.. అసలు సమస్య స్ట్రైక్‌రేట్ వద్ద వచ్చింది. 120కంటే తక్కువ వేగంతో ఆడటం వల్ల జట్టుకు అవసరమైన మోమెంటమ్ రాలేదు. క్రీజ్‌లో తిలక్ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాతో తొలి సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. టోర్నీ నుంచి తిలక్ వర్మ నిష్క్రమించే ప్రమాదం కనిపించింది. అలాంటి సమయంలో జింబాబ్వే మ్యాచ్ తిలక్ వర్మకు నిజంగా ‘మేక్ ఆర్ బ్రేక్’ లాంటి అవకాశంగా మారింది. సాధారణంగా నంబర్ 3లో ఆడే తిలక్ ఈసారి నంబర్ 6కు పంపడం కొంత షాక్ ఇచ్చినట్టే. కానీ తిలక్ ఆ నిరాశను బయటపెట్టలేదు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
క్రీజ్‌లోకి వచ్చేసరికి భారత్ 14.5 ఓవర్లలో 172/4తో బలమైన స్థితిలో ఉంది. ఓపెనర్ సంజూ శాంసన్ దూకుడు ఆరంభం, అభిషేక్ శర్మతో పాటు ఇతరుల సహకారం ఫలించింది. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని తిలక్ ఈ అవకాశాన్ని వదల్లేదు. కేవలం 16 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. తిలక్ ఇన్నింగ్స్‌తో భారత్ 256/4 భారీ స్కోరు నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాటల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. “జట్టుకు ఏం అవసరమైతే నేను సిద్ధమే. గత నాలుగేళ్లుగా ఐపీఎల్‌లో ముంబాయి తరఫున పరిస్థితికి అనుగుణంగా గేర్ మార్చాను. భారత జట్టుకూ అదే విధంగా సహకరించగలను. ఒక మంచి ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాను. దేవుడి దయతో అది వచ్చింది. ఇక ముందు మ్యాచ్‌లు సైతం గెలిపించగలననే నమ్మకం ఉంది,” అని అన్నాడు. సంజూ శాంసన్‌పై కూడా తిలక్ ప్రశంసలు కురిపించాడు.
READ MORE: Suryakumar Yadav: మ్యాచ్ గెలిచినా కెప్టెన్ సూర్య అసంతృప్తి.. అక్కడే తేడా కొట్టిందని వారిపై సీరియస్!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!