IND vs WI Qualification Scenarios: భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు.. అదే జరిగితే టీమిండియా ఇంటికే!
- మరింత ఉత్కంఠగా సెమీ ఫైనల్ రేస్
- భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు
- అదే జరిగితే టీమిండియా ఇంటికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies Super 8 Qualification Scenario for Semi Finals in T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026లో సెమీ ఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. గ్రూప్1లో ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా.. జింబాబ్వే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్, వెస్టిండీస్ జట్ల సెమీస్ రేస్ రసవత్తరంగా ఉంది. మార్చి 1న జరిగే మ్యాచ్ ఇరు జట్ల భవితవ్యంను నిర్ణయించనుంది. ఈ పోరు కోల్‌కతా వేదికగా జరగనుండగా.. ప్రస్తుత సమీకరణాల ప్రకారం వెస్టిండీస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
గురువారం (ఫిబ్రవరి 26) సాయంత్రం వరకు భారత్ సెమీస్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఒక్కరోజే టీమిండియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించడం, జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో భారత్ ఒక్కసారిగా సెమీస్ రేసులో నిలిచింది. ఇక సెమీస్‌కు చేరాలంటే తప్పనిసరిగా మార్చి 1న వెస్టిండీస్‌పై గెలవాల్సిందే. విజయం సాధిస్తే సూర్య సేన నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ రేండేసి పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్ రన్ రేట్‌లో కరేబియన్లు (+1.791) ముందంజలో ఉన్నారు. భారత్ రన్ రేట్ -0.100గా ఉంది.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
Also Read: Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు వెస్టిండీస్ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌గా మారింది. సూర్య సేనకు గెలుపు తప్ప మరో మార్గం లేదు. వెస్టిండీస్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కరేబియన్లకు కూడా విజయం అవసరమే కానీ.. మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా సెమీస్ చేరుతారు. అంటే విండీస్‌కు రెండు మార్గాలు ఉండగా.. భారత్‌కు మాత్రం ఒకటే మార్గం గెలుపు. ఈ మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్‌కు ఎలాంటి పాత్ర ఉండదు. ఎవరు గెలిస్తే వారు ముందుకు వెళుతారు. దీంతో భారత్ అభిమానులు ఈ పోరును మినీ ఫైనల్ మ్యాచ్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం పడొద్దని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!