Bank Holiday March 2026: ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు
- బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. మార్చి నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో బ్యాంకు సెలవులు భారీగా ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, మార్చిలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్ తయారీ లేదా రుణ సంబంధిత విధానాలు వంటి ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు వచ్చే నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా సెలవుల జాబితాను తనిఖీ చేయండి.
Also Read:Lunar Eclipse: శివయ్య భక్తులకు అలర్ట్.. ఆ రోజున వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల మూసివేత
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
RBI బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం, మార్చి 2026లో అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. అదనంగా, RBI మార్చి 2, 3, 4, 13, 17, 19, 20, 21, 26, 27, 31 తేదీల్లో బ్యాంకు సెలవులను ప్రకటించింది. మార్చిలో ఐదు ఆదివారాలు ఉండటం గమనించదగ్గ విషయం, అంటే మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. సెలవు రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మీ కొన్ని ముఖ్యమైన పనులను నిర్వహించుకోవచ్చని గమనించడం ముఖ్యం.
Also Read:Virosh wedding : ఎట్టకేలకు ఒక్కటైన ‘విరోష్’.. నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్!
మార్చిలో బ్యాంకు సెలవుల లిస్ట్
మార్చి 1 -ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మార్చి 2 – హోలికా దహన్ కారణంగా కాన్పూర్, లక్నోలోని బ్యాంకులకు సెలవు
మార్చి 3- హోలీ రెండో రోజు అలాగే బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, రాంచీ, విజయవాడలలో బ్యాంకులకు సెలవు
మార్చి 4- అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇంఫాల్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లాలోని బ్యాంకులు బంద్.
మార్చి 8 – ఆదివారం
మార్చి 13- చాప్చర్ కుట్ కారణంగా ఈ రోజుఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
మార్చి 14- నెలలో రెండవ శనివారం.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
మార్చి 15 -ఆదివారం సెలవు
మార్చి 17 – షబ్-ఎ-ఖాదర్ కారణంగా జమ్మూ అండ్ శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
మార్చి 19- గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినం. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్, విజయవాడలో బ్యాంకులు బంద్.
మార్చి 20 -ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)/జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు.
మార్చి 21 – రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1)/ఖుతుబ్-ఎ-రంజాన్/సర్హుల్ కారణంగా కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు.
మార్చి 22 – ఆదివారం సెలవు
మార్చి 26 -శ్రీరామ నవమి. ఈ కారణంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, చండీగఢ్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాంచీ, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు.
మార్చి 27 – శ్రీరామ నవమి (చైతి దాసైన్) సందర్భంగా భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, పాట్నా, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు.
మార్చి 28 – నెలలో నాల్గవ శనివారం.. అన్ని బ్యాంకులకు సెలవు
మార్చి 29- ఆదివారం
మార్చి 31- మహావీర్ జన్మకల్యాణక్/మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులకు సెలవు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!