ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన సెర్చింగ్‌ బ్రౌజర్‌  గూగుల్ క్రోమ్.

ఇప్పటికీ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ అప్రమత్తం చేసింది.

109.0.5414.119 (ఆపిల్/లినక్స్).... 109.0.514.119/120 (విండోస్) వెర్షన్ల కంటే ముందు వెర్షన్ వాడుతున్నవారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలి.

క్రోమ్ పాత వెర్షన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, దాంతో హ్యాకర్లు ఎంతో సులభంగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని సీఈఆర్టీ-ఎన్ వెల్లడించింది. 

వెబ్ ఆర్టీపీ అండ్ గెస్ట్ వ్యూ, టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్, వెబ్ ట్రాన్స్ పోర్ట్ తదితర లోపాలను క్రోమ్ పాత వెర్షన్ లో గుర్తించామని తెలిపింది.

ఈ లోపాలతో హ్యాకర్లు ప్రపంచంలో ఎక్కడ్నించైనా సరే కంప్యూటర్లను తమ అధీనంలోకి తీసుకునే వీలుందని పేర్కొంది. 

హ్యాకర్లు తాము రూపొందించిన వెబ్ పేజ్ ను క్రోమ్ లో ప్రవేశపెడతారని తెలిపింది.

దీనిపై యూజర్లు క్లిక్ చేస్తే వారి సమాచారం అంతా హ్యాకర్ల వశమవుతుందని వివరించింది.

యూజర్లు త్వరగా తమ క్రోమ్‌ బ్రౌజర్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్డేట్‌ చేసుకోవాలి.