Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో రీమిక్స్ పాటలకు పెట్టింది పేరు తనిష్క్ బాగ్చి. టీవీ సీరియల్స్ నుంచి మొదలైన తన ప్రయాణం ‘దిల్బర్’, ‘ఆంఖ్ మారే’ వంటి సెన్సేషనల్ సాంగ్స్ నుంచి గతేడాది వచ్చిన ‘సయ్యారా’ వరకు ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, యూట్యూబ్‌లో బిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించినా, ఆర్థికంగా సంగీత దర్శకులకు దక్కాల్సిన గౌరవం, ప్రతిఫలం అందడం లేదని తనిష్క్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ‘రాయల్టీ’ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రతిభావంతులు ఎలా నష్టపోతున్నారో ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.
Also Read : Vijay:తాళి కటెప్పుడు చేతులు వణికాయి..రష్మికకు అది మూడోసారి కాబట్టి కూల్‌గా ఉంది..
Also Read
తనిష్క్ బాగ్చి మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో నా పాటలకు 37 బిలియన్ల (3,700 కోట్లు) వ్యూస్ ఉన్నాయి. ఈ లెక్కలు ఏదైనా విదేశీ మ్యూజిక్ కంపెనీకి చెబితే, నాకో ప్రైవేట్ జెట్ ఉంటుందని వాళ్లు అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. విదేశాల్లో పాట రాసిన వారికి, కంపోజ్ చేసిన వారికి, సౌండ్ ఇంజనీర్లకు కూడా రాయల్టీలు వస్తాయి. అది వారికి ఆర్థిక భరోసా ఇస్తుంది. కానీ ఇండియాలో కేవలం ఒక్కసారి పారితోషికం ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఆ తర్వాత ఆ పాట ఎన్ని కోట్లు సంపాదించినా మాకు వచ్చేది సున్నా’ అని వాపోయారు. అంతే కాదు ప్రచారం కోసం పీఆర్ (PR) వ్యవస్థ అవసరమని, కానీ చాలా మంది టాలెంటెడ్ మ్యూజిషియన్స్ దాన్ని భరించలేరని ఆయన పేర్కొన్నారు. ఐపిఆర్ఎస్ (IPRS) వంటి సంస్థల వల్ల ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారుతున్నాయని, భవిష్యత్తులో చిన్న టెక్నీషియన్లకు కూడా రాయల్టీ అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. టీవీ సీరియల్స్ నుంచి మొదలైన తన ప్రయాణం ప్రస్తుతం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’, ‘ధడక్ 2’ వంటి భారీ చిత్రాల వరకు చేరిందని, ఎన్ని విజయాలు ఉన్నా ఇక్కడ నిలబడాలంటే ప్రతిరోజూ కొత్తగా పోరాడాల్సిందేనని తనిష్క్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!